IND vs WI: స్పిన్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ.. వైరల్ అయిన వీడియో..
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుపొందింది...
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 237 పరుగులు మాత్రమే చేసింది. సూర్యాకుమార్ యాదవ్ 64 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ 46 ఓవర్లలో కేవలం 193 పరుగులకు ఆలౌటైంది. భారత యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 9 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ చాహల్‌పై అగ్రహం వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 45వ ఓవర్ ప్రారంభానికి ముందు, రోహిత్ శర్మ రాంగ్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యుజ్వేంద్ర చాహల్‌ను చూసినప్పుడు, అతనికి ఒక్కసారిగా కోపం వచ్చింది. రోహిత్ శర్మ యుజ్వేంద్ర చాహల్‌తో ఇలా అన్నాడు- ‘మీకు ఏమైంది, మీరు ఎందుకు సరిగ్గా పరిగెత్తడం లేదు? అక్కడికి పరిగెత్తు.’ రోహిత్ శర్మకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓడిన్ స్మిత్ హిట్టింగ్ టీమ్ ఇండియాను కాస్త కలవర పెట్టింది.
Me to my buddies in Gully Cricket when they get tired after 2 overs of Fielding ??? pic.twitter.com/NDIuNWRPY4
— Shantanu Ghosh (@imshantanu105) February 9, 2022
45వ ఓవర్‌లో రోహిత్ శర్మ వాషింగ్టన్ సుందర్‌ను బౌలింగ్‌కు దించాడు. అదే ఓవర్‌లో టీమ్ ఇండియా ఓడిన్ స్మిత్ వికెట్ పడగొట్టింది. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్‌లను కూడా ఔట్ చేయడానికి రోహిత్ శర్మ వ్యూహం రచించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీ కనిపించింది. యుజ్వేంద్ర చాహల్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. అతను 10 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.