AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: పదవి నుంచి తప్పుకున్న సెలక్షన్ కమిటీ సభ్యుడు.. కారణం అదేనా..

టీమ్ ఇండియా సెలక్టర్ ఒకరు తన పదవిని ఆకస్మికంగా వదులుకున్నారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో అతను సభ్యుడు...

BCCI: పదవి నుంచి తప్పుకున్న సెలక్షన్ కమిటీ సభ్యుడు.. కారణం అదేనా..
Bcci
Srinivas Chekkilla
|

Updated on: Feb 10, 2022 | 8:11 AM

Share

టీమ్ ఇండియా సెలక్టర్ ఒకరు తన పదవిని ఆకస్మికంగా వదులుకున్నారు. చేతన్ శర్మ(Chetan Sharma) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో అతను సభ్యుడు. నిజానికి సెలక్షన్ కమిటీలో ఒక్కో జోన్ నుంచి ఒక సెలెక్టర్ ఉంటారు. వెస్ట్ జోన్ సెలెక్టర్ అబే కురువిల్లా(abey kuruvilla) ఆకస్మికంగా తన పదవిని విడిచిపెట్టారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అబే కురువిల్లా నిష్క్రమణ తర్వాత, BCCI ఇప్పుడు అతని స్థానంలో కొత్త సెలెక్టర్ నియమించేందుకు ప్రయత్నిస్తుంది. కురువిల్లాను పదవి వదులుకోవడానికి కారణం భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధనే. సెలక్షన్ కమిటీలో 5 సంవత్సరాలకు మించి ఏ వ్యక్తిని పని చేయకూడదు.

ముంబై మాజీ ఫాస్ట్ బౌలర్ కురువిల్లా డిసెంబర్ 2020లో వెస్ట్ జోన్ నుంచి టీమ్ ఇండియా సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. అంతకు ముందు అతను జూనియర్ సెలక్షన్ కమిటీకి చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నాడు. అతను 4 సంవత్సరాల పాటు ఈ పదవిని నిర్వహించాడు. కురువిల్లా హయాంలోనే 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇలా భారత్ తరఫున 10 టెస్టులు, 25 వన్డేలు ఆడిన కురువిల్లా సెలక్షన్ కమిటీలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం బోర్డు నిబంధన గురించి BCCI అధికారులకు తెలియదు. జనవరిలో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా దీనిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తెలిసింది. కురువిల్లా వైదొలిగిన తర్వాత, భారత సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం 4 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు – చేతన్ శర్మ, సునీల్ జోషి, హర్విందర్ సింగ్, దేబాశిష్ మొహంతి. కురువిల్లా స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ఇప్పుడు కొత్త దరఖాస్తులను ఆహ్వానించనుంది.

బోర్డు అధికారులు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, “కురువిల్లా పదవీకాలం ముగిసింది. ఇప్పుడు BCCI తాజా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. క్రికెట్ సలహా కమిటీ కొత్త అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తుంది. సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకున్న తర్వాత బీసీసీఐ ఇప్పుడు 53 ఏళ్ల అబే కురువిల్లాకు జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్‌మెంట్) కొత్త పదవిని అప్పగించవచ్చని వార్తలు వచ్చాయి. గత నెలలో ధీరజ్ మల్హోత్రా రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది.

Read Also.. IND vs WI: స్పిన్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ.. వైరల్‌ అయిన వీడియో..