AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Felicitated: భారత అండర్ 19 జట్టు సభ్యులకు సన్మానం.. స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్ చూసిన జూనియర్లు..

బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో భారత అండర్-19 జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సత్కరించింది...

Felicitated: భారత అండర్ 19 జట్టు సభ్యులకు సన్మానం.. స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్ చూసిన జూనియర్లు..
Under 19
Srinivas Chekkilla
|

Updated on: Feb 10, 2022 | 9:40 AM

Share

బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ(Narendra modi) క్రికెట్ స్టేడియంలో భారత అండర్-19 జట్టు(under 19 team)ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (bcci) సత్కరించింది. ప్రధాన కోచ్ హృషికేష్ కనిట్కర్, ఇతర సహాయక సిబ్బంది కూడా సన్మానించారు. అనంతరం వెస్టిండీస్, భారత్ మ్యాచ్‌ను స్టాండ్స్‌లో కూర్చుండి వీక్షించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం రూపొందించిన బయో-బబుల్‌లో భాగంగా విజయవంతమైన జట్టు సభ్యులు సీనియర్ భారత క్రికెటర్లను కలవలేకపోయారు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే బీసీసీఐ సెక్రటరీ జే షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ కూడా ఉన్నారు.

భారత అండర్-19 జట్టు మంగళవారం స్వదేశానికి తిరిగి వచ్చింది. స్క్వాడ్ మంగళవారం ఉదయం బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి అహ్మదాబాద్ చేరుకుంది. అబ్బాయిలు గురువారం నాటికి వారి స్వస్థలాలకు చేరుకోనున్నారు. ఫిబ్రవరి 5న జరిగిన అండర్-19 వరల్డ్‌ కప్‌లో భారత జట్టును ఇంగ్లాండ్‌ను ఓడించి.. ఐదోసారి U-19 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటికే ఆటగాళ్లకు రూ.40 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.25 లక్షల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది.

Read Also.. IND vs WI: స్పిన్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ.. వైరల్‌ అయిన వీడియో..