IND Vs AUS: అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. ఆసీస్‌కే సాధ్యం.. దెబ్బకు టీమిండియా ఫసక్..

స్వదేశంలో భారత్‌ను ఓడించాలంటే ప్రత్యర్ధులకు పెద్ద టాస్కే. ఏ పర్యాటక జట్టైనా సిరీస్ సమర్పించుకోవాల్సిందే..

IND Vs AUS: అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. ఆసీస్‌కే సాధ్యం.. దెబ్బకు టీమిండియా ఫసక్..
Ind Vs Aus
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2023 | 8:22 AM

స్వదేశంలో భారత్‌ను ఓడించాలంటే ప్రత్యర్ధులకు పెద్ద టాస్కే. ఏ పర్యాటక జట్టైనా సిరీస్ సమర్పించుకోవాల్సిందే. అయితే ఆస్ట్రేలియా విషయంలో మాత్రం దీనికి రివర్స్ జరిగింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం చోటు చేసుకున్న సీన్.. మళ్లీ ఇప్పుడూ రిపీట్ అయింది. అప్పుడొక దశలో 0-2తో వెనుకబడిన ఆసీస్.. చివరికి 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో వెనుకబడినా.. స్టీవ్ స్మిత్ సారధ్యంలో ఆస్ట్రేలియా పుంజుకుని.. భారత గడ్డపై మరో వన్డే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది కంగారూ జట్టు. మొదటి రెండు వన్డేలలోనూ టీమిండియాను పేస్, స్వింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన ఆస్ట్రేలియా.. చివరి వన్డేలో స్పిన్‌తో బోల్తా కొట్టించింది.

ప్యాట్ కమిన్స్ సారధిగా టెస్ట్ సిరీస్‌లోకి అడుగుపెట్టిన ఆసీస్ జట్టు ఒకవైపు అయితే.. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ లీడ్‌లో బరిలోకి దిగిన టీం మరోవైపు అని చెప్పాలి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మొదటి రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ జట్టును ప్యాట్ కమిన్స్ సారధ్యం వహించాడు. ఇక ఈ రెండు మ్యాచ్‌ల్లో కంగారూలను స్పిన్‌తో బోల్తా కొట్టించింది భారత్. అయితే మూడో టెస్టు నుంచి సీన్ మారిపోయింది.

స్టీవ్ స్మిత్ సారధ్యంలో ఆసీస్ జట్టు పుంజుకుంది. స్పిన్‌ మాయలో పడేసి టీమిండియాను బోల్తా కొట్టించింది. అలాగే నాలుగో టెస్టులోనూ భారత్‌కు గట్టి పోటీనిచ్చి.. ధీటుగా నిలిచింది. ఇక వన్డే సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి వన్డేలో వెనుకబడినా.. చివరి రెండు వన్డేలలోనూ స్పూర్తిదాయక ప్రదర్శనతో సిరీస్ గెలుచుకుంది. ముఖ్యంగా స్టీవ్ స్మిత్.. తన కెప్టెన్సీ స్కిల్స్‌తో మరోసారి సత్తా చాటాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్లను పరుగులు చేయనివ్వకుండా చక్కటి ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్‌తో వారిని బురిడీ కొట్టించాడు. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్, ఫీల్డింగ్ కూడా అద్భుతమని చెప్పాలి.

కాగా, 2019 తర్వాత తొలిసారిగా టీమిండియా స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమిపాలైంది. అప్పుడు 3-2తో ఆరోన్ ఫించ్ సారధ్యంలో కోహ్లీసేనను బోల్తాకొట్టించిన కంగారూలు.. ఇప్పుడు 2-1తో స్టీవ్ స్మిత్ సారధిగా ఆస్ట్రేలియా.. రోహిత్ సేన‌ను ఓడించి.. టెస్టులు, వన్డేల్లో నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది.