AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ధోని రికార్డ్‌ను బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్.. తొలి భారత ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర..

Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ల రికార్డును హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. దీంతో టీమిండియా కొత్త సిక్సర్ కింగ్‌గా మారాడు.

IND vs NZ: ధోని రికార్డ్‌ను బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్.. తొలి భారత ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర..
Rohit Sharma
Venkata Chari
| Edited By: |

Updated on: Jan 19, 2023 | 8:05 AM

Share

IND Vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జనవరి 18 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలైంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డులపై కన్నేసిన టీమిండియా సారథి రోహిత్ శర్మ.. బరలోకి దిగిన కొద్దిసేపట్లోనే ధోనిని వెనక్కునెట్టేశాడు. భారత్‌లో ఆడుతున్నప్పుడు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్..

భారత జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో భారీ రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌లో భారత్‌లో ఆడుతున్నప్పుడు అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును రోహిత్ సొంతం చేసుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ ఈ రికార్డును సాధించాడు. హైదరాబాద్ వన్డేకు ముందు ఈ ఫార్మాట్‌లో భారత గడ్డపై రోహిత్, మహేంద్ర సింగ్ ధోనీలు 123 సిక్సర్లు కొట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక నేడు హైదరాబాద్‌లో హిట్ మ్యాన్ 5 వ ఓవర్లో భారీ సిక్స్ బాది.. భారతదేశం తరపున కొత్త సిక్సర్ కింగ్‌గా మారాడు.

74 ఇన్నింగ్స్‌ల్లోనే 124 సిక్సులు..

35 ఏళ్ల రోహిత్ శర్మ భారత్‌లో ఆడిన కేవలం 74 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం భారతదేశంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆల్ టైమ్ రికార్డును అధిగమించాడు. 238 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 125 సిక్సర్లు కొట్టాడు. ధోని కంటే రెండు ఎక్కువగా బాదేశాడు. సచిన్ టెండూల్కర్ తన బ్యాట్ నుంచి 71 సిక్సులతో మూడో స్థానంలో ఉండగా, యువరాజ్ సింగ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్ 29 సెంచరీలతో వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేశాడు.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు