AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : హిట్‌మ్యాన్ సిక్సర్ల సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు

Rohit Sharma : ఐపీఎల్ 2026లో రోహిత్ శర్మ 78 పరుగుల ఇన్నింగ్స్‌తో 5 భారీ రికార్డులు సృష్టించాడు. విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ ఐదు భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Rohit Sharma : హిట్‌మ్యాన్ సిక్సర్ల సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు
Rohit Sharma (2)
Rakesh
|

Updated on: Mar 30, 2026 | 11:47 AM

Share

Rohit Sharma : ఐపీఎల్ 2026 సీజన్‌ను రోహిత్ శర్మ కళ్లు చెదిరే రీతిలో ప్రారంభించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 78 పరుగుల ఇన్నింగ్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. రయాన్ రికెల్టన్‌తో కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్, ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రన్ చేజ్‌ను అందించాడు. 205.26 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కేవలం మ్యాచే కాదు, ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ ఐదు భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

రోహిత్ శర్మ సృష్టించిన 5 భారీ రికార్డులు ఇవే:

కెరీర్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్‌కు ఇదే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ. గతంలో 2015లో చెన్నైపై చేసిన 25 బంతుల ఫిఫ్టీ రికార్డును ఇన్నేళ్లకు రోహిత్ బద్దలు కొట్టాడు.

విరాట్ కోహ్లీ రికార్డు మటాష్: ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. కోల్‌కతాపై రోహిత్ ఇప్పటివరకు 1161 పరుగులు చేశాడు. అంతకుముందు పంజాబ్‌పై 1159 పరుగులు చేసిన కోహ్లీ రికార్డును రోహిత్ వెనక్కి నెట్టేశాడు.

ఆసియా ఖండంలోనే తొలి బ్యాటర్: టీ20 క్రికెట్‌లో 550 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రోహిత్ రికార్డుకెక్కాడు. ఆసియాలో మరే ఇతర బ్యాటర్ కనీసం 450 సిక్సర్ల మార్కును కూడా చేరుకోలేదు.

వార్నర్‌ను దాటేసిన హిట్‌మ్యాన్: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ (1093 పరుగులు) రికార్డును రోహిత్ తుడిచిపెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో 11 పరుగులు చేయగానే వార్నర్‌ను రోహిత్ అధిగమించాడు.

ఫిఫ్టీల హాఫ్ సెంచరీ: ఐపీఎల్ కెరీర్‌లో 50వ సారి 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్‌గా రోహిత్ గుర్తింపు పొందాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us