IND vs AUS: ప్లేయర్లుగా వెళ్లారు.. కట్‌చేస్తే.. రోహిత్ ఎఫెక్ట్‌తో టూరిస్ట్‌లుగా తిరిగొస్తున్నారు.. లిస్ట్‌లో నలుగురు

India vs Australia Test Series: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడి ఉంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఐదో, చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది. దీంతో సిరీస్‌ను డ్రాగా ముగించే అవకాశం భారత్‌కు ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ పరంగా భారత జట్టుకు సిడ్నీ టెస్ట్ చాలా కీలకంగా మారింది.

IND vs AUS: ప్లేయర్లుగా వెళ్లారు.. కట్‌చేస్తే.. రోహిత్ ఎఫెక్ట్‌తో టూరిస్ట్‌లుగా తిరిగొస్తున్నారు.. లిస్ట్‌లో నలుగురు
Rohit Sharma

Updated on: Dec 31, 2024 | 2:40 PM

India vs Australia Test Series: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడి ఉంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఐదో, చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది. దీంతో సిరీస్‌ను డ్రాగా ముగించే అవకాశం భారత్‌కు ఉంది. తొలి 4 మ్యాచ్‌ల్లో చాలా మంది దిగ్గజాలు విఫలమయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్‌లు పూర్తిగా సైలెంట్‌గా ఉన్నాయి. పెర్త్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం మినహా విరాట్‌ ప్రత్యేక ప్రదర్శన ఏమీ చేయలేదు. బౌలింగ్‌లో ఆకాశ్‌దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇద్దరూ కొన్ని ఇన్నింగ్స్‌ల్లో ఆకట్టుకున్నారు. దిగ్గజ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఆకాష్, సిరాజ్ మద్దతు ఇవ్వలేకపోయారు.

బెంచ్‌లో ఎదురుచూస్తోన్న స్టార్ ప్లేయర్స్..

ఓ వైపు స్టార్ బ్యాట్స్‌మెన్స్ విఫలమవుతుంటే.. మరోవైపు పలువురు స్టార్లు బెంచ్‌లో మగ్గిపోతున్నారు. వారికి సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో కూడా పెద్దగా మార్పులు కనిపించలేదు. ఈ సిరీస్‌లో టీమిండియాకు చెందిన నలుగురు బౌలర్లకు ఇంకా ఆడే అవకాశం రాలేదు. అలాంటి వారు ఎవరో ఓసారి చూద్దాం..

సర్ఫరాజ్ ఖాన్: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతను తన ప్రదర్శనతో నిలకడగా ఆకట్టుకుంటున్నాడు. సర్ఫరాజ్ 6 టెస్ట్ మ్యాచ్‌లలో 11 ఇన్నింగ్స్‌లలో 371 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని సగటు 37.1గా ఉంది. సర్ఫరాజన్‌కు సెంచరీ ఉంది. అతను 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. మరి ఇప్పుడు సిడ్నీ టెస్టులో అతనికి అవకాశం లభిస్తుందా లేదా అనేది చూడాలి. ఆడకపోతే టూరిస్టుగా మాత్రమే ఇంటికి తిరిగి రానున్నాడు.

ఇవి కూడా చదవండి

అభిమన్యు ఈశ్వరన్: ఈ బెంగాల్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ మరోసారి టూరిస్ట్‌గా మారిన తర్వాతే టీమిండియాతో తిరిగి వస్తాడని తెలుస్తోంది. అభిమన్యుకి టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఇంకా రాలేదు. 29 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7674 పరుగులు చేశాడు. అతని పేరు మీద 27 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయినప్పటికీ అతనికి ఆడే అవకాశం రావడం లేదు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్ చేస్తున్నారు. కాబట్టి, ఈ యంగ్ ప్లేయర్‌కు ఆడడం కష్టంగా మారింది.

ప్రసిద్ధ్ కృష్ణ: ఈ సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శన ప్రశ్నార్థకంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా తప్ప ఎవరూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చే రీతిలో బౌలింగ్ చేయలేదు. ఆకాష్, సిరాజ్ బౌలింగ్‌లో నిలకడ కొరవడింది. వీరిద్దరిలో ఎవరికైనా రెస్ట్ ఇవ్వడం వల్ల ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని అనిపించినా అది కుదరలేదు. భారత్ తరపున 2 టెస్టు మ్యాచ్‌ల్లో 2 వికెట్లు తీసిన కృష్ణ తన వంతు కోసం ఎదురుచూస్తున్నాడు.

తనుష్ కోటియాన్: రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాలో చేరిన తనుష్ కొటియన్‌కు మెల్‌బోర్న్‌లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు సిడ్నీలో స్పిన్నర్లకు సహాయం అందుతుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే వెళతాడా లేక తనుష్ కోటియన్‌కు అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తనుష్ ఆడకపోతే టూరిస్ట్‌గా స్వదేశానికి తిరిగొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..