AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఫాస్టెస్ట్‌ డబుల్ సెంచరీ.. కట్‌ చేస్తే టీమిండియా ప్లేయింగ్-XI లో నో ప్లేస్

గౌహతి వన్డేకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ ఓపెనింగ్‌ జోడిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవాకం జరిగే మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్- XI నుంచి ఇషాన్‌ కిషన్‌ను తప్పించడం దురదృష్టకరమన్నాడు.

IND vs SL: 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఫాస్టెస్ట్‌ డబుల్ సెంచరీ.. కట్‌ చేస్తే టీమిండియా ప్లేయింగ్-XI లో నో ప్లేస్
Team India
Basha Shek
|

Updated on: Jan 09, 2023 | 8:49 PM

Share

మరికొన్ని గంటల్లో భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ మంగళవారం (జనవరి 10) గౌహతి వేదికగా జరగనుంది. లంకతో టీ20 సిరీస్‌కు దూరమైన సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. దీంతో యువ ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ ప్రారంభానికి ముందే సిరీస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అయితే బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఇషాన్‌ కిషన్‌కు కూడా ప్లేయింగ్- XI లో చోటు దక్కడం లేదని తెలుస్తోంది. ఛటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌పై కిషన్ 210 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌లో కిషన్ 10 సిక్సర్లు, 24 ఫోర్లు కొట్టి వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే గౌహతి వన్డేకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ ఓపెనింగ్‌ జోడిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టీమిండియా ప్లేయింగ్- XI నుంచి ఇషాన్‌ కిషన్‌ను తప్పించడం దురదృష్టకరమన్నాడు. తద్వారా మొదటి వన్డేలో ఇషాన్‌ ఆడడని చెప్పకనే చెప్పాడు. అతని స్థానంలో శుభమాన్ గిల్‌కు స్థానం కల్పించనున్నట్లు పేర్కొన్నాడు. అంటే రోహిత్‌తో కలిసి గిల్‌ ఓపెనింగ్‌కు దిగనున్నాడు.

వన్డే ఫార్మాట్‌లో గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. గిల్ గతేడాది 12 మ్యాచ్‌ల్లో 70.88 సగటుతో 638 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో అతనికి మరిన్ని అవకాశాలు కల్పించాలని రోహిత్ భావిస్తున్నాడు. ఇషాన్‌ను తప్పిస్తే వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌కు ప్లేస్‌ గ్యారెంటీ. అయితే బంగ్లాలో ఘోరంగా విఫలమయ్యాడు రాహుల్‌. పైగా గత ఆరు ఇన్నింగ్సుల్లో కనీసం ఒక అర్ధసెంచరీ కూడా చేయలేకపోయాడు. కాగా వన్డే సిరీస్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించబోతున్నారు. విరాట్ కోహ్లీ మళ్లీ వచ్చాడు. రోహిత్ శర్మ కూడా జట్టులోకి వచ్చాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో కేఎల్ రాహుల్‌కు కూడా అవకాశం దక్కనుంది. ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ జట్టుకు దూరమవడానికి ఇదే కారణం. కాగా వన్డే జట్టు నుంచి జస్ప్రీత్ బుమ్రాను తప్పించడంపై రోహిత్ శర్మ కూడా పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు. ఎన్‌సీఏలో బౌలింగ్ చేస్తున్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా కొన్ని ఇబ్బందులు పడుతున్నాడని, అందుకే ముందు జాగ్రత్తగానే వన్డే సిరీస్‌కు దూరం పెట్టినట్లు హిట్‌ మ్యాన్‌ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..