Video: నీతా అంబానీతో సుదీర్ఘ చర్చలు.. కట్‌చేస్తే.. బెంగళూరుకు బ్యాగ్ సర్దేసిన రోహిత్ శర్మ..

Rohit Sharma and Nita Ambani: లక్నో సూపర్‌జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video: నీతా అంబానీతో సుదీర్ఘ చర్చలు.. కట్‌చేస్తే.. బెంగళూరుకు బ్యాగ్ సర్దేసిన రోహిత్ శర్మ..
Rohit Sharma And Nita Ambani
Follow us
Venkata Chari

|

Updated on: May 20, 2024 | 11:55 AM

Rohit Sharma and Nita Ambani: ఐపీఎల్ 2024 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ నిలిచింది. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ముంబై తన చివరి మ్యాచ్‌లోనూ లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడి ఓడిపోయింది. టోర్నీ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ని కెప్టెన్‌గా ముంబై జట్టు ప్రకటించింది. ఇక్కడ రోహిత్ కెప్టెన్సీని వదులుకోలేదు. బదులుగా ఫ్రాంచైజీ రోహిత్‌ను తొలగించి హార్దిక్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది.

లక్నో సూపర్‌జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ అనంతరం వారిద్దరూ వాంఖడే స్టేడియంలో సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వీరిద్దరి మాట తీరు, ముఖ కవళికలను బట్టి గంభీరమైన సంభాషణ సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి

నీతా అంబానీ, రోహిత్ మధ్య సంభాషణ వీడియో:

IPL 2024 వేలానికి ముందు, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను విడిచిపెట్టి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. కొన్ని రోజుల తర్వాత హార్దిక్‌ని హీరోగా చేస్తానని ప్రకటించారు. ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన భార్య రితికా కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యనించింది. ఈ నిర్ణయంతో రోహిత్ సంతోషంగా లేడని స్పష్టం అవుతోంది. అయితే ఈ విషయంపై రోహిత్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.

ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే నిబంధనలు ఇంకా రాలేదు. కానీ, నివేదికల ప్రకారం, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తో ఉండటానికి ఇష్టపడడు. దాంతో రోహిత్ ఆర్సీబీలో చేరతాడని అభిమానులు అంటున్నారు. ఐపీఎల్ తొలి 5 సీజన్లలో ముంబై ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఆ తర్వాత రోహిత్ సారథ్యంలో ఆ జట్టు 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..