AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: ఆస్ట్రేలియా కామెంటేటర్లను చూసి సిగ్గుతెచ్చుకోండి! క్రిటిక్స్ కు ఇచ్చిపడేసిన హిట్ మ్యాన్!

టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ తనపై వస్తున్న అసత్య విమర్శలపై ఘాటుగా స్పందించాడు. మీడియా, కామెంటేటర్లు నిజమైన విశ్లేషణకు బదులుగా "మసాలా"కి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డాడు. ఆస్ట్రేలియన్ వ్యాఖ్యాతల గౌరవాన్ని అభినందిస్తూ, భారత వ్యాఖ్యాతలు మారాల్సిన అవసరముందన్నాడు. తన ఫామ్ పై విమర్శలను తిప్పికొడుతూ, తాను ఇకవీటిని పట్టించుకోనని స్పష్టం చేశాడు.

Rohit Sharma: ఆస్ట్రేలియా కామెంటేటర్లను చూసి సిగ్గుతెచ్చుకోండి! క్రిటిక్స్ కు ఇచ్చిపడేసిన హిట్ మ్యాన్!
Rohit Sharma Comments
Narsimha
|

Updated on: May 10, 2025 | 2:00 PM

Share

భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల తన టెస్ట్ రిటైర్మెంట్ అనంతరం వచ్చిన అన్యాయమైన విమర్శలపై తీవ్రంగా స్పందించాడు. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన ప్రకటన చేయగా, ఇది అభిమానులను, నిపుణులను ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవడం ఈ ప్రకటనను మరింత ప్రాధాన్యంతో ముందుకు తెచ్చింది. అయితే టెస్ట్ రిటైర్మెంట్ చేసిన కొద్దిసేపటికే, ప్రముఖ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో జరిగిన ఓ ఫిల్టర్‌ లెస్ ఇంటర్వ్యూలో రోహిత్ తనపై జరుగుతున్న విమర్శలకు ధీటుగా స్పందించాడు. విమర్శ అనేది ఆటగాళ్ల జీవితంలో భాగమే అయినా, అనవసరమైన, అసత్య విమర్శలు తనకు అసహనాన్ని కలిగిస్తున్నాయని వెల్లడించాడు.

గత సంవత్సరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాతో పోరులో భారత్ కోల్పోవడం, ఆపై సిడ్నీలో జరిగిన టెస్ట్‌ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం వంటి నిర్ణయాలపై వచ్చిన ప్రతికూల స్పందన తనను బాధించిందని చెప్పాడు. తన ఫామ్ పట్ల నిరంతర విమర్శలు, ముఖ్యంగా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్లకు తాను బలహీనుడననే అభిప్రాయాలను ఖండిస్తూ, రోహిత్ శర్మ “ఇలాంటి విమర్శల గురించి నేను ఇకపై ఆలోచించను, ఎందుకంటే సమయం ఎంతో విలువైనది. దానిని తప్పు విషయాలు రుజువు చేయడంలో ఖర్చు చేయడం నాకు అవసరం లేదు,” అని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యల ద్వారా రోహిత్ తన మానసిక స్థైర్యాన్ని మరియు విమర్శలను ఎదుర్కొనే ధైర్యాన్ని వెల్లడించాడు.

అంతేకాక, ఈ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ భారతీయ వ్యాఖ్యాతలను కూడా విమర్శించడంలో వెనుకాడలేదు. నేటి క్రికెట్ మీడియా “మసాలా”, “ఎజెండా” ఆధారితంగా మారిందని, నిజమైన విశ్లేషణకంటే నాటకీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెట్‌ వ్యాఖ్యాతలు ఆటగాళ్లను గౌరవించాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత దాడులకు బదులుగా విలువైన, అర్థవంతమైన విశ్లేషణను అందించాలన్నది ఆయన అభిప్రాయం. “ఆస్ట్రేలియాలో క్రికెట్ వ్యాఖ్యాన వ్యవస్థ ఎలా ఉన్నదో చూడండి. వాళ్లు ఆటగాళ్లకు గౌరవాన్ని ఇస్తారు. మన దేశంలో కూడా అదే నైతికత పాటించాలి,” అని రోహిత్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్‌ విశ్లేషణ వ్యవస్థపై కూడ తీవ్ర విమర్శగా మారాయి.

ఈ మొత్తం అంశం రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన అనంతరం, అతను తన ప్రయాణంపై గర్వంగా ఉన్నప్పటికీ, విమర్శల నుండి వచ్చిన గాయాలను వెలిబుచ్చిన ఒక భావోద్వేగ ఘటనగా నిలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..