DC Vs RR: నో బాల్ ఇవ్వకుంటే బయటకు వచ్చేయండి.. క్రీజ్‌లో ఉన్న ఆటగాళ్లకు రిషబ్ పంత్ పిలుపు..
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్(Rishab Pant), పేసర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur), అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలకు జరిమానా విధించారు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్(Rishab Pant), పేసర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur), అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలకు జరిమానా విధించారు. పంత్‌కు మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించారు. ఠాకూర్‌పై 50 శాతం, ఆమ్రేపై 100 శాతం మ్యాచ్ ఫీజుతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించారు. ఐపీఎల్-2022లో శుక్రవారం ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదానికి సంబంధంచి ఈ నిర్ణయం తీసుకన్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్‌ను ఒబెద్ మెక్‌కాయ్ వేశాడు. మూడో బంతిని ఫుల్ టాస్ వేశాడు. దీన్నిఢిల్లీ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్ సిక్సర్ బాదాడు. ఈ బాల్ నడుము పైకి వచ్చిన ఫుల్ టాస్ అని, అందుకే నో బాల్ ఇవ్వాలని ఢిల్లీ జట్టు డిమాండ్ చేసింది. అయితే ఫీల్డ్ అంపైర్లు దాన్ని నో బాల్‌గా ప్రకటించలేదు.
దీంతో కోపోద్రిక్తుడైన పంత్ బౌండరీ వెలుపల నిలబడి ఉన్న ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఠాకూర్ అతనితో ఉన్నాడు. ఆమ్రే ఓ అడుగు ముందుకేసి గ్రౌండ్‌కి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ల నిర్ణయంతో పంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సహాయం తీసుకోవాలని ఢిల్లీ జట్టు డిమాండ్ చేసింది. ఇది జరగకపోతే మైదానంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌లు పావెల్, కుల్దీప్ యాదవ్‌లను బయటకు రావాలని పంత్ సంకేతాలు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ఢిల్లీకి ఇది నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్నాడు.
ముగ్గురూ తమ తప్పును ఒప్పుకున్నారు
ఆర్టికల్ 2.7 ప్రకారం పంత్ లెవల్-2 నేరానికి పాల్పడ్డాడు. మరోవైపు, ఆర్టికల్ 2.8 ప్రకారం ఠాకూర్ లెవల్-2 నేరానికి పాల్పడ్డారు. ఆర్టికల్ 2.2 ప్రకారం ఆమ్రే లెవల్-2 నేరానికి పాల్పడ్డారు. వారందరూ తమ తప్పును అంగీకరించారు. శిక్షను కూడా అంగీకరించారు.
#RishabhPant ???
Whole incident on umpiring…..#DCvsRR #DCvRR #RRvsDC #RRvDC #IPL2022 #IPL #umpire #noball #Shardulthakur #SanjuSamson #umpiring #Cheater @RishabhPant17 @IamSanjuSamson #DelhiCapitals #shanewatson #rovmanpowell @tanay_chawda1 @Cricketracker #JosButler pic.twitter.com/NRYdlMxrZk
— Anmol Narang (@Anmol_Narang_) April 22, 2022
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read Also.. KKR vs GT IPL 2022 Match Prediction: కోల్‌కతా మళ్లీ గాడిన పడేనా ? గుజరాత్‌తో పోరుకు సిద్ధమైన శ్రేయస్ సేన..