
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషభ్ పంత్ దాదాపు 18 నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఎంపికైన పంత్ బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 165.52 స్ట్రైక్ రేట్‌తో 53 పరుగులు చేశాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పంత్ మెరుపు బ్యాటింగ్ అభిమానులను ఆనందపరిచింది. అయితే ఈ ఆనందాన్ని డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు పంత్ అభిమానులు. దీంతో ఇప్పుడు వారిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
రిషబ్ పంత్‌కు కేరళలోనూ వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పంత్ పునరాగమనాన్ని పురస్కరించుకుని కొల్లంలోని ఓ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకు స్కూల్ బ్యాగులు, స్టేషనరీ కిట్‌లు పంపిణీ చేశారు కొందరు అభిమానులు. అంతకు ముందు కేక్ కట్ చేసి పంత్ రీ ఎంట్రీని జరుపుకున్నారు. ఈ కేక్‌పై రిషబ్ పంత్ కోసం ప్రత్యేక సందేశాన్ని కూడా రాశారు. ఇలా మొత్తానికి 18 నెలల సుదీర్ఘ కాలం తర్వాత పంత్ టీమ్ ఇండియాలోకి రావడంతో అభిమానులు గ్రాండ్ గా సంబరాలు చేసుకున్నారు.
2022 డిసెంబర్‌లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ దాదాపు 1.5 ఏళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్ ఐపీఎల్ ద్వారా క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. అక్కడ మంచి ప్రదర్శన కనబరిచిన పంత్.. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఇప్పుడు పంత్ జట్టు ప్రధాన వికెట్ కీపర్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు.
Rishabh Pant fans in Kerala celebrated their Idol’s return to Indian team after 18 long months in an orphanage in Kollam by distributing school bags, Stationary kits to kids and cutting a cake with them. 👌 pic.twitter.com/xhWeT9GvDL
— Johns. (@CricCrazyJohns) June 3, 2024
తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన పంత్.. టీమ్ ఇండియా జెర్సీ ధరించిన తర్వాత నాలో భిన్నమైన స్ఫూర్తి నెలకొందన్నాడు. ‘నేను థ్రిల్‌గా ఉన్నాను. ఇది భిన్నమైన అనుభవం. మళ్లీ అరంగేట్రం చేస్తున్నట్టు అనిపిస్తుంది జీవితంలో ఆలోచనా దృక్పథం కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియాకు ఆడేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.
SL, SA and BAN are struggling in this pitch meanwhile Rishabh Pant in the Same Pitch pic.twitter.com/xmPYjfiZjD
— Flamboy Pant (@flamboypant) June 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..