AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant Video: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వన్డే ప్రపంచకప్ 2023 జట్టులో రిషబ్ పంత్..

World Cup 2023: పంత్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న బీసీసీఐ, 2023 వన్డే ప్రపంచ కప్‌కు అతనిని ఫిట్‌గా ఉండేలా చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే NCAలో చేర్చింది. దీంతో వేగవంతం ఫిట్‌గా మారేలా చాలా కష్టపడుతున్నాడు.

Rishabh Pant Video: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వన్డే ప్రపంచకప్ 2023 జట్టులో రిషబ్ పంత్..
Rishab Pant
Venkata Chari
|

Updated on: Jun 16, 2023 | 8:21 PM

Share

గతేడాది డిసెంబర్ 30న జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్.. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా పంత్ తెలియజేశాడు. ఎలాంటి సపోర్టు లేకుండా మెట్లు ఎక్కుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో సెలెక్టర్లకు, అభిమానులకు టీమిండియా శుభవార్త అందించింది. పంత్ కోలుకున్న తర్వాత 2023 చివరిలో జరిగే వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పంత్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న బీసీసీఐ, 2023 వన్డే ప్రపంచ కప్‌కు అతనిని ఫిట్‌గా ఉండేలా చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే NCAలో చేర్చింది. దీంతో వేగవంతం ఫిట్‌గా మారేలా సాధ్యమవుతోంది. టీమిండియా యంగ్ ప్లేయర్పం త్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం కఠిన శిక్షణ తీసుకుంటున్నాడు. NCAలో పంత్ సహచరులు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ప్రషీద్ద్ కృష్ణ ఉన్నారు. పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్‌సీఏలో స్టిక్ సహాయంతో మెట్లు ఎక్కడాన్ని, అలాగే ఎలాంటి సహాయం లేకుండా మెట్లు ఎక్కుంతుండడాన్ని పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

డిసెంబర్ 30, 2022, ఉదయం 5:30 గంటల ప్రాంతంలో, పంత్ తన స్వస్థలం రూర్కీకి కారులో వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో మంటలు చెలరేగడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కారు ప్రమాదంలో ఈ యంగ్ ప్లేయర్‌కు అనేక గాయాలు అయ్యాయి. తద్వారా 2023లో క్రికెట్ ఆడడని ముందు అనుకున్నారు. అయితే పంత్ కోలుకుంటున్న స్పీడ్ దృష్ట్యా వచ్చే వన్డే ప్రపంచకప్ లో టీమిండియా తరపున ఆడే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..