AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికీ పాంటింగ్‌ ఇండియా కోచ్‌ ఆఫర్‌ వద్దనడానికి కారణం చెప్పాడు.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Ricky Ponting: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించారు. అతని మార్గదర్శకత్వంలో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది.

రికీ పాంటింగ్‌ ఇండియా కోచ్‌ ఆఫర్‌ వద్దనడానికి కారణం చెప్పాడు.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Ricky Ponting
uppula Raju
|

Updated on: Nov 19, 2021 | 6:02 AM

Share

Ricky Ponting: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించారు. అతని మార్గదర్శకత్వంలో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది. ఇప్పుడు రాబోయే రెండేళ్ల పాటు ఇతడి పర్యవేక్షణలో, టీమ్ ఇండియా కొత్త శిఖరాలను తాకడానికి ప్రయత్నిస్తుంది. రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన తర్వాత ద్రవిడ్‌ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందే ఇండియా కోచ్ ఆఫర్ ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‌కి వచ్చింది. అయితే దీనిని పాంటింగ్‌ తిరస్కరించారు.

.పాంటింగ్ ఆస్ట్రేలియాకు రెండుసార్లు ప్రపంచ కప్ తీసుకొచ్చిన లెజండరీ బ్యాట్స్‌మెన్‌. గత కొన్ని సీజన్‌లుగా పాంటింగ్‌ IPLలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా ఉన్నారు. అతని మార్గదర్శకత్వంలో జట్టు బాగా రాణిస్తోంది. ఇది కాకుండా పాంటింగ్‌ ఆస్ట్రేలియా జట్టు కన్సల్టెంట్‌గా కూడా ఉన్నారు. కానీ దానిని ప్రస్తుతం కొనసాగించడం లేదు. కేవలం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మాత్రమే సంబంధం కలిగి ఉన్నారు. అయితే పాంటింగ్ ఇండియా కోచ్ ఆఫర్‌ని తిరస్కరించడానికి ఈ కారణాలను చెప్పారు.

‘తనను టీమ్ ఇండియా కోచ్‌గా చేయాలని బీసీసీఐ కోరిందని అయితే తాను దానిని తిరస్కరించాల్సి వచ్చిందని, దీనికి ప్రధాన కారణం సమయాభావం అని పాంటింగ్ చెప్పారు’ దాదాపు 20 సంవత్సరాలు తన దేశం కోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన పాంటింగ్ చాలా కాలం పాటు కుటుంబానికి దూరంగా ఉన్నారు. 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని పాంటింగ్‌ అన్నారు. అతను ఏ జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండకపోవడానికి ఇదే కారణం. ఈ విషయాన్ని పాంటింగ్ ‘ది గ్రేడ్ క్రికెటర్’ పోడ్‌కాస్ట్‌లో వివరించారు.

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు

Indian Railway: అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..