Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే.. ఆ టీమ్‌కు అంత సీన్ లేదంటున్న దిగ్గజాలు

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరగనుంది. అదే సమయంలో టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. ఇక మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే.. ఆ టీమ్‌కు అంత సీన్ లేదంటున్న దిగ్గజాలు
Champions Trophy 2025
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2025 | 4:42 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్, భారత్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్‌, ఇంగ్లాండ్‌లు ఈ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. అయితే ఈ ఎనిమిది జట్లలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్ ఆడుతాయని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. గత మూడు ఐసీసీ టోర్నీల్లో భారత్, ఆస్ట్రేలియాలు రెండుసార్లు ఫైనల్ ఆడాయి. ఈ రెండు జట్లు 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ పోరు జరగవచ్చని పాంటింగ్ చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మాదిరిగానే ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు తలపడడం దాదాపు ఖాయమని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, భారత్‌, ఆస్ట్రేలియా జట్లు సెమీ స్ చేరతాయని అంచనా వేశాడు. వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనలిస్టులు భారత్‌-ఆస్ట్రేలియాలను దాటుకుని.. ఇతర జట్లు ఫైనల్ చేరడం కష్టమే అని అంచనా వేశాడు. పాకిస్థాన్ కూడా సెమీస్ చేరడం కష్టమే అని రవిశాస్త్రి అంచనా వేశాడు.

ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. అందుకే ఈసారి కూడా వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడిన జట్లే టైటిల్ గెలుచుకునే ఫేవరెట్ జట్లుగా గుర్తింపు పొందాయి. దీని ప్రకారం వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ ఆడతాయో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా షెడ్యూల్:

  • భారత్ vs బంగ్లాదేశ్: ఫిబ్రవరి 20 (దుబాయ్)
  • భారత్ vs పాకిస్థాన్: ఫిబ్రవరి 23 (దుబాయ్)
  • భారత్ vs న్యూజిలాండ్: మార్చి 2 (దుబాయ్)
  • సెమీ-ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 4 (దుబాయ్)
  • ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 9 (దుబాయ్)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..