IPL 2024: ‘కోహ్లీ ఫ్యాన్స్ రాసిపెట్టుకోండి.. ప్లేఆఫ్స్ నుంచి ఆర్‌సీబీ వైదోలిగినట్టే..’

|

May 16, 2024 | 5:42 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2024) సీజన్ 17 లీగ్ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మాత్రమే 65 మ్యాచ్‌లు ముగియగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్లు. మిగిలిన 2 స్థానాల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్..

IPL 2024: కోహ్లీ ఫ్యాన్స్ రాసిపెట్టుకోండి.. ప్లేఆఫ్స్ నుంచి ఆర్‌సీబీ వైదోలిగినట్టే..
Rcb
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2024) సీజన్ 17 లీగ్ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే 65 లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తప్పితే.. మిగితా రెండు స్థానాల్లో ఎవరు ప్లేఆఫ్స్‌కి చేరారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చివరి రెండు స్థానాలపై గట్టి పోటీ నెలకొంది. ఈ తరుణంలో మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, మాథ్యూ హెడెన్, టామ్ మూడీ టాప్-4 జట్లను ప్రకటించేశారు. అలాగే వారి అంచనాలతో అటు కోహ్లీ ఫ్యాన్స్.. ఇటు బెంగళూరు జట్టు డై-హార్డ్ ఫ్యాన్స్‌కి నిరాశను మిగిల్చారు.

ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని భావిస్తున్నట్టు ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. దీంతో సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లు ప్లేఆఫ్‌లోకి చేరుతాయి. అలా చూసుకుంటే KKR, RR, CSK, SRH జట్లు టాప్-4లో నిలుస్తాయి. అటు అంబటి రాయుడు కూడా.. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌లో ఆడతాయని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఆర్‌సీబీపై సీఎస్‌కే జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుందని వీరి అంచనా. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. RCBపై గెలిచి CSK ప్లేఆఫ్స్‌లోకి చేరుతుందన్నాడు. అటు భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా CSKపై RCB గెలవడం కష్టమని పేర్కొన్నాడు. చివరి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా CSK ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుందని చెప్పాడు. కెకెఆర్‌, ఆర్‌ఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, సిఎస్‌కె జట్లు టాప్‌-4లో కనిపిస్తాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ టామ్‌ మూడీ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కీలక మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోతుందని టామ్ మూడీ జోస్యం చెప్పాడు.