AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Captain For IPL 2025: ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా జెర్సీ నంబర్ 97.. ఆ లెగసీ కంటిన్యూ చేసేనా?

RCB New Captain Announcement Highlights: ఐపీఎల్ 2025కి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు వెల్లడించనున్నట్లు బెంగళూరు ఫ్రాంచైజీ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆరోజు రానే వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

RCB Captain For IPL 2025: ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా జెర్సీ నంబర్ 97.. ఆ లెగసీ కంటిన్యూ చేసేనా?
Rcb Captain Rajat Patidar
Venkata Chari
|

Updated on: Feb 13, 2025 | 12:12 PM

Share

RCB Captain For IPL 2025 Announcement Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ మార్చిలో ప్రారంభం కానుంది. దీంతో అభిమానులలో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. 2024లో నాల్గవ స్థానంలో నిలిచిన బెంగళూరు ఫ్రాంచైజీ.. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ విడుదలైన తర్వాత కొత్త నాయకుడి కోసం తీవ్రంగా శోధించింది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్ అయ్యే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో.. నేడు బెంగళూరులో యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్‌ని సారథిగా నియమించినట్లు ప్రకటించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2025 12:05 PM (IST)

    కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్..

    ఆర్‌సీబీ కొత్త సారథిగా రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈపేరును వెల్లడించిన ఫ్రాంచైజీ.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తాడంటూ చెప్పుకొచ్చింది.

  • 13 Feb 2025 11:30 AM (IST)

    RCB Captain For IPL 2025: ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా జెర్సీ నంబర్ 97?

    తాజాగా వచ్చిన లీకుల మేరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చిందంటూ కొన్ని ట్వీట్స్ వైరలవుతున్నాయి. అందులో ఓ పిన్ కోడ్‌ ఇచ్చినట్లు చూడొచ్చు. అందులో జెర్సీ నంబర్ 97 ఉంది. ఆర్‌సీబీ జెర్సీ నంబర్ 97 రజత్ పాటిదార్ దే కాడం గమనార్హం.

  • 13 Feb 2025 11:27 AM (IST)

    దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే?

    ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌పై దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే..

  • 13 Feb 2025 11:20 AM (IST)

    RCB Captain For IPL 2025: కొత్త కెప్టెన్‌పై కీలక హింట్ ఇచ్చిన ఆర్‌సీబీ

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌పై ఫ్రాంచైజీ కీలక హింట్ ఇచ్చింది.

  • 13 Feb 2025 11:10 AM (IST)

    RCB Captain For IPL 2025: కోహ్లీ నాయకత్వం వహించే అవకాశం ఉందా, లేదా?

    2013, 2021 మధ్య విరాట్ కోహ్లీ RCB కెప్టెన్‌గా ఉన్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడంతో అతను రాజీనామా చేశాడు. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ IPL 2025లో మరోసారి కెప్టెన్సీని చేపట్టకపోవచ్చని RCB యాజమాన్యానికి తెలియజేశాడని తెలుస్తోంది. RCB కెప్టెన్‌గా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. కానీ, ఆర్‌సీబీకి ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ను అందించలేకపోయాడు.

  • 13 Feb 2025 11:05 AM (IST)

    RCB Captain For IPL 2025: కృనాల్ పాండ్యా మంచి ఎంపిక..

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా బలమైన కెప్టెన్సీ ఎంపిక కావచ్చు. గతంలో, అతను IPL 2023లో కేఎల్ రాహుల్ లేనప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీనితో పాటు, అతను దేశీయ క్రికెట్‌లో బరోడాకు నాయకత్వం వహిస్తున్నాడు. అపారమైన అనుభవం కలిగిన కృనాల్.. RCBకి బలమైన కెప్టెన్‌గా ఉంటాడు.

  • 13 Feb 2025 10:59 AM (IST)

    మరో బలమైన అభ్యర్థిగా ఇంగ్లండ్ డేంజరస్ ప్లేయర్..

    రాబోయే ఐపీఎల్ కోసం రాయల్ ఛాలెంజర్ బెంగళూరు విదేశీ కెప్టెన్ కోసం చూస్తున్నట్లయితే, ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాటర్ ఫిల్ సాల్ట్ బలమైన ఎంపిక కావొచ్చు. ఈయన బలమైన ఓపెనర్, తన పవర్ హిట్టింగ్‌తో బ్యాటింగ్ లైనప్‌కు మంచి పునాదిని అందించగలడు. గతంలో ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన సాల్ట్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. జోస్ బట్లర్ లేనప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అతను ఇంగ్లాండ్‌ను ముందుండి నడిపించాడు.

  • 13 Feb 2025 10:48 AM (IST)

    RCB Captain For IPL 2025: నాయకుడిగా కోహ్లీ తనదైన ముద్ర..

    విరాట్ కోహ్లీ 143 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి నాయకత్వం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచాడు. కోహ్లీ కెరీర్‌లో 68 విజయాలు, 70 ఓటములు, 4 మ్యాచ్‌ల్లో ఫలితాలు రాని మ్యాచ్‌లు ఉన్నాయి. 2016లో, కోహ్లీ ఫ్రాంచైజీని ఐపీఎల్ ఫైనల్‌కు నడిపించాడు. ఓకే సీజన్‌లో 973 పరుగులతో అత్యధికంగా నిలిచేలా చేశాడు. ఐపీఎల్ 2024లో, కోహ్లీ 154 స్ట్రైక్ రేట్‌తో 741 పరుగులతో టాప్ రన్-స్కోరర్‌గా నిలిచాడు.

  • 13 Feb 2025 10:44 AM (IST)

    RCB New Captain Announcement LIVE Updates: రేసులో భువనేశ్వర్..

    రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యాతో పాటు, భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ రూపంలో ఆర్‌సీబీకి బలమైన కెప్టెన్సీ ఎంపిక కూడా ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన మెగా వేలంలో 35 ఏళ్ల ఈ పేసర్‌ను ఆర్‌సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు, భువీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. కొన్ని సందర్భాలలో జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.

  • 13 Feb 2025 10:41 AM (IST)

    RCB Captain For IPL 2025: RCB కెప్టెన్ల పూర్తి జాబితా

    రాహుల్ ద్రవిడ్ – 2008-2008
    కెవిన్ పీటర్సన్ – 2009-2009
    అనిల్ కుంబ్లే – 2009-2010
    డేనియల్ వెట్టోరి – 2011-2012
    విరాట్ కోహ్లీ – 2011-2023
    షేన్ వాట్సన్ – 2017-2017
    ఫాఫ్ డు ప్లెసిస్ – 2022-2024

Published On - Feb 13,2025 10:39 AM