Ravindra Jadeja: ‘క్రికెటర్‌ను చేసి తప్పు చేశా.. కోడలి కారణంగానే కలహాలు ‘.. జడేజా తండ్రి సంచలన ఆరోపణలు
గురువారం అంటే ఫిబ్రవరి 8తో అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఈ శుభ సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుని మురిసిపోయాడు కూడా. అయితే ఇంతలోనే రవీంద్ర జడేజాపై సంచలన ఆరోపణలు చేశారు అతని తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా.

గురువారం అంటే ఫిబ్రవరి 8తో అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఈ శుభ సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుని మురిసిపోయాడు కూడా. అయితే ఇంతలోనే రవీంద్ర జడేజాపై సంచలన ఆరోపణలు చేశారు అతని తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా. జడేజాతో పాటు అతని భార్య రివాబాపై కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారాయన. ఈ విమర్శలు టీమిండియా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. అనిరుధ్ జడేజా స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘నా కొడుకు రవీంద్ర జడేజా కొన్నాళ్లుగా మాతో టచ్‌లో లేడు. ప్రస్తుతం నేను జామ్‌నగర్‌లోని 2 బిహెచ్‌కె ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నాను. ఒకప్పుడు నా కొడుకు కూడా నాతోపాటు అదే ఫ్లాట్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడు నేను ఈ ఫ్లాట్‌లో 20 వేల రూపాయల సొంత పెన్షన్‌తో జీవిస్తున్నాను. రవీంద్ర పెళ్లి తర్వాత 2-3 నెలలు బాగానే సాగాయి. అయితే ఆ తర్వాత జడేజా ప్రవర్తనలో మార్పు వచ్చింది. నా కొడుకు నాతో మాట్లాడటం మానేశాడు. నా కొడుకుపై అతని భార్య రివాబా ఏం మాయ చేసిందో నాకు తెలియదు. దాదాపు ఐదేళ్లుగా మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. పెళ్లి తర్వాత నా కొడుకు పూర్తిగా మారిపోయాడు. అతను భార్ మాటలు వినడం ప్రారంభించిన తర్వాత నాతో మాట్లాడటం మానేశాడు. ఇదంతా చూస్తుంటే నా కొడుకుని క్రికెటర్‌ని చేయకుంటే బాగుండేది. అప్పుడు అతను రివాబాను పెళ్లి చేసుకునేవాడు కాదు. అలా చేసుంటే ఇప్పుడు ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు. మా కుటుంబంలో చీలికలు రావడానికి జడేజా భార్య రివాబానే కారణం’ అని సంచలన ఆరోపణలు చేశాడు.
జడేజా తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో తన తండ్రి చేసిన ఆరోపణలన్నింటికీ వివరణ ఇచ్చాడు. ‘ఈ ఆరోపణలన్నీ ముందే ఏర్పాటు చేసిన కుట్ర. ఆయన చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ప్రతిదీ సత్యానికి దూరంగా ఉంది. ఇదంతా నా భార్య పేరు చెడగొట్టే ప్రయత్నం. వీటన్నింటినీ ఖండిస్తున్నాను. బీజెపీ అభ్యర్థిగా జామ్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే బహిరంగంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు ‘ అని జడేజా తెలిపాడు. జడేజా ఫ్యామిలీలో తలెత్తిన ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
రవీంద్ర జడేజా ట్వీట్..
Let’s ignore what’s said in scripted interviews 🙏 pic.twitter.com/y3LtW7ZbiC
— Ravindrasinh jadeja (@imjadeja) February 9, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








