AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఎనిమిది మ్యాచ్‌ల నిరీక్షణ.. పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?

IPL 2026 : చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ రామకృష్ణ ఘోష్ ఐపీఎల్ 2026లో ముంబైపై అద్భుత అరంగేట్రం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీసి, కీలక క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్ సగం ముగిసినా, 8 మ్యాచ్‌ల వరకు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.

IPL 2026 : ఎనిమిది మ్యాచ్‌ల నిరీక్షణ.. పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
Ramakrishna
Rakesh
|

Updated on: May 03, 2026 | 7:09 AM

Share

IPL 2026 : ఐపీఎల్ లాంటి భారీ టోర్నీలో అవకాశం రావడమే కష్టం, అలాంటిది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ రామకృష్ణ ఘోష్ సరిగ్గా ఇదే పని చేశాడు. గత సీజన్ నుంచి రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన ఈ యంగ్ ప్లేయర్, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేసి తన ముద్ర వేశాడు.

రామకృష్ణ ఘోష్ గత సీజన్ నుంచే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడానికి అతనికి చాలా సమయం పట్టింది. ఐపీఎల్ 2026 సీజన్ సగం ముగిసినా, 8 మ్యాచ్‌ల వరకు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన 44వ మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతనికి అవకాశం ఇచ్చాడు. పొడగరి అయిన రామకృష్ణ, తన ఎత్తును వాడుకుంటూ బంతిని సంధించే తీరు డెబ్యూలోనే క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రామకృష్ణ ఘోష్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి ఓవర్‌ను వేశాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన సూర్యకుమార్ యాదవ్‌ను తన పదో బంతికే పెవిలియన్ పంపాడు. సూర్య లాంటి ప్రమాదకరమైన బ్యాటర్‌ను తక్కువ స్కోరుకే అవుట్ చేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. మొదటి ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా, మైదానంలో చురుగ్గా ఉంటూ ఒక అద్భుతమైన క్యాచ్ కూడా అందుకున్నాడు.

సాధారణంగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం యువ ఆటగాళ్లను ఎంపిక చేసి, వారికి సరైన సమయం వచ్చే వరకు శిక్షణ ఇస్తుంది. రామకృష్ణ ఘోష్ విషయంలో కూడా అదే జరిగింది. నెట్స్‌లో ధోనీ లాంటి దిగ్గజాలకు బౌలింగ్ చేసి రాటుదేలిన ఈ బెంగాల్ పేసర్, వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. తన బౌలింగ్‌లో వైవిధ్యం చూపిస్తూ ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ లాంటి వారితో కలిసి కీలక సమయాల్లో వికెట్లు తీసి ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఘోష్ కీలక పాత్ర పోషించాడు.

రామకృష్ణ ఘోష్ ప్రదర్శన చూస్తుంటే, రానున్న మ్యాచ్‌ల్లో అతను చెన్నై ప్రధాన బౌలర్లలో ఒకడిగా మారే అవకాశం ఉంది. డెత్‌ ఓవర్లలో కూడా బంతిని కంట్రోల్ తో వేయగలగడం అతనికి ప్లస్ పాయింట్. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ తన అథ్లెటిసిజాన్ని నిరూపించుకున్నాడు. ఈ డెబ్యూ తర్వాత సోషల్ మీడియాలో రామకృష్ణపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సీఎస్‌కే ఫ్యాన్స్ అయితే మరో కొత్త డైమండ్ ధోనీ టీమ్ కనిపెట్టిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us