సారపాకలో మద్యం మత్తులో ఓ యువకుడు బీరు సీసాతో తన పొట్టలో పొడుచుకుని తీవ్రంగా గాయపడ్డాడు. గంటపాటు కర్రతో ప్రజలను భయపెడుతూ రోడ్డుపై వీరంగం సృష్టించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.