AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్‌కు తలనొప్పిలా మారిన కెప్టెన్.. ఎందుకో తెలుసా?

Sanju Samson: వేలి గాయం నుంచి కోలుకున్న తర్వాత సంజు సామ్సన్ ఇప్పుడు తన ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)లో చేరాడు. దీంతో ఐపీఎల్ 2025 కోసం ఆర్ఆర్ జట్టు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే, కెప్టెన్ ఫిట్‌నెస్ సమస్యతో ఆర్ఆర్ జట్టు పెద్ద సమస్యల్లో పడేటట్టు కనిపిస్తోంది.

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్‌కు తలనొప్పిలా మారిన కెప్టెన్.. ఎందుకో తెలుసా?
Sanju Samson
Venkata Chari
|

Updated on: Mar 19, 2025 | 10:46 AM

Share

వేలి గాయం నుంచి కోలుకున్న తర్వాత కెప్టెన్ సంజు సామ్సన్ ఇప్పుడు తన ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)లో చేరాడు. 30 ఏళ్ల సామ్సన్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన చికిత్సను పూర్తి చేసుకున్నాడు. సోమవారం రాయల్స్ తొలి సెషన్‌లో ఆయన పాల్గొన్నాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ సామ్సన్‌ను తాకింది. గాయం తర్వాత అతనికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. “ఎప్పటిలాగే అందరి ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి విమానాశ్రయం నుంచి నేరుగా మొదటి ప్రాక్టీస్ సెషన్‌కు” అంటై రాయల్స్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

సామ్సన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడారు. పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పటికీ వికెట్ కీపింగ్ చేయగలడో లేదో చూడాలి. కాకపోతే, ఈ బాధ్యతను ధ్రువ్ జురెల్‌కు ఇవ్వవచ్చు అని భావిస్తున్నారు.

తొలి ఐపీఎల్ ఛాంపియన్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ఈసారి తమ ప్రచారాన్ని మార్చి 23న ప్రారంభిస్తుంది. అక్కడ హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనున్నారు.

రాజస్థాన్ కు మరో శుభవార్త ఏమిటంటే, ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ గాయం కారణంగా, అతను దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. రంజీ ట్రోఫీ రెండో దశలో 23 ఏళ్ల పరాగ్ తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతను సౌరాష్ట్రపై అర్ధ సెంచరీ సాధించి 26 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు –

సంజు సామ్సన్ (కెప్టెన్), శుభమ్ దుబే, షిమ్రాన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), వానిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ, అశోక్ శర్మ, ఫజల్‌హాక్ ఫరూఖీ, ఆకాష్ మధ్వాల్, క్వెనా ఎంఫాకా, మహేష్ తీక్ష్ణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..