Virat Kohli: కోహ్లీ దెబ్బకు వెనక్కి తగ్గిన BCCI.. అది దా కోహ్లీ రేంజ్!
బీసీసీఐ విదేశీ పర్యటనలకు క్రికెటర్లు కుటుంబాలను తీసుకెళ్లరాదని కొత్త నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యుల సహకారం ఆటగాళ్ల మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీసీఐ ఈ నిర్ణయంపై పునరాలోచన చేసే అవకాశం ఉంది. ఆటగాళ్ళు కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు అనుమతి కోరే అవకాశం కల్పించారు.

టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లిన సమయంలో ఫ్యామిలీస్‌తో వెళ్లకూడదనే రూల్‌ను బీసీసీఐ కొత్తగా తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఫేలవ ప్రదర్శన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చినా.. సీనియర్ స్టార్ ప్లేయర్లను నియంత్రించాలంటే ఇలాంటి రూల్స్ అవసరం అని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఈ విషయంపై స్పందిస్తూ.. ఏ ఆటగాడిని అడిగినా కుటుంబంతో ఉండాలనే చెబుతారు. ఏదైనా మ్యాచ్‌లో సరైన ప్రదర్శన చేయనప్పుడు మనం ఒంటిరిగా ఫీలవుతాం. ఆ సమయంలో మన ప్రియమైన వారు అంటే కుటుంబ సభ్యులు మనంతో ఉంటే ఆ బాధ నుంచి బయటికి వస్తాం. సరిగ్గా ఆడకుంటే రూమ్‌లోకి వెళ్లి ఒంటరిగా కూర్చోని విచారించడం నాకు నచ్చదు. దాని నుంచి బయటికి రావాలి.
అలా రావాలంటే మనతో కుటుంబ సభ్యులు ఉండాలి. మనం మ్యాచ్‌లో మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చామా లేదా అనేదే ముఖ్యం. అలా ఇచ్చిన తర్వాత మనం మన జీవితంలోకి తిరిగి రావాలి అని కోహ్లీ వెల్లడించాడు. ఇది బీసీసీఐ తీసుకొచ్చిన తాజా రూల్‌పై కోహ్లీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఉంది. కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ ఇలా అనడంతో బీసీసీఐ కూడా ఈ రూల్ విషయంలో పునరాలోచించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోహ్లీ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందని భావిస్తూ.. ఈ రూల్స్ సడలింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆటగాళ్ళు ఇప్పుడు తమ కుటుంబ సభ్యులను టూర్లలో ఎక్కువ కాలం ఉండటానికి బోర్డు అనుమతిని అడగవచ్చు. “ఆటగాళ్ళు తమ కుటుంబాలు పర్యటనలలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. BCCI తనకు తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుంది” అని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌కు ముందు జరిగిన ఇటీవలి ప్రమోషనల్ కార్యక్రమంలో, విరాట్ కోహ్లీ కుటుంబాల ప్రాముఖ్యత గురిం, సుదీర్ఘ పర్యటనలలో అవి ఎలా సహాయపడతాయో మాట్లాడారు. “45 రోజులకు పైగా విదేశీ సిరీస్ టూర్ ఉంటే ఆటగాళ్ల భార్యలు, పిల్లలు (18 ఏళ్లలోపు) రెండు వారాల వరకు సిరీస్‌కు ఒకసారి (ఫార్మాట్ వారీగా) సందర్శించవచ్చు. అయితే వారి వసతి ఖర్చులను కూడా భరిస్తామని బోర్డు తెలిపింది. ఇతర ఖర్చులన్నీ క్రికెటర్ భరించాలి. ఈ రూల్ నుంచి ఏమైనా మినహాయింపులు కావాలంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్, ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ నుంచి అనుమతి పొందాలని కూడా బీసీసీఐ గతంలో స్పష్టం చేసింది.
Virat Kohli on BCCI’s family restriction rule#viratkohli #rcb #ipl #ipl2025 #bcci #cricket #championstrophy2025 #indvsaus #bgt #indiancricketteam #teamindia #family #cricketnews #latestnews #sports #sportstoday pic.twitter.com/cZgp1LHCSl
— Sports Today (@SportsTodayofc) March 16, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




