15 బంతుల్లో విధ్వంసం.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లో నంబర్ 1గా 14 ఏళ్ల సెన్సేషన్..
Vaibhav Suryavanshi Highest Strike Rate in IPL 2025: వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ ఆటగాడు ఓ అద్భుత రికార్డు సృష్టించాడు. ఇది నిజంగా అద్భుతమైనది. సూర్యవంశీ టిమ్ డేవిడ్, నికోలస్ పూరన్ వంటి బ్యాట్స్‌మెన్‌లను కూడా అధిగమించాడు.

Vaibhav Suryavanshi Highest Strike Rate in IPL 2025: ఐపీఎల్ 2025 (IPL 2025)లో రాజస్థాన్ రాయల్స్ పేలవమైన ప్రదర్శన కనబరిచి ఉండవచ్చు. కానీ, ఆ జట్టు తరపున 14 ఏళ్ల ఆటగాడు అందరి హృదయాలను గెలుచుకున్నాడు. తన పవర్ ఫుల్ హిట్టింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ.. దేశ వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో 40 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కీలక విషయం ఏమిటంటే అతను తన ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయలేదు. 4 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. అంటే, కేవలం బౌండరీలతోనే ఈ పరుగులు సాధించడం గమనార్హం. దీంతో ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత, వైభవ్ సూర్యవంశీ ఒక విషయంలో నంబర్ 1 అయ్యాడు. అతను నికోలస్ పూరన్, టిమ్ డేవిడ్‌లను కూడా వెనక్కునెట్టేశాడు.
వైభవ్ సూర్యవంశీ నంబర్ 1..
వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ IPL 2025లో అత్యధికంగా మారింది. కనీసం యాభై బంతులు ఆడిన ఆటగాళ్లలో, వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ 219.10గా నిలిచింది. రెండవ స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. అతను 200.98 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 193.75 స్ట్రైక్ రేట్‌తో, ప్రియాంష్ ఆర్య 190.37 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశారు.
IPL 2025లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన..
వైభవ్ సూర్యవంశీ IPL 2025లో 6 మ్యాచ్‌ల్లో 219.10 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు చేశాడు. మొత్తం 195 పరుగులలో సిక్సర్లు, ఫోర్ల నుంచే 166 పరుగులు చేశాడు. అంటే అతను దాదాపు 85% పరుగులను బౌండరీల ద్వారానే సాధించాడు. ఈ గణాంకాలు అతని పవర్ హిట్టింగ్, నిర్భయమైన శైలిని ప్రతిబింబిస్తున్నాయి.
వైభవ్ చారిత్రాత్మక సెంచరీ..
2025 ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో, అతను 7 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. అతని బ్యాట్ 265.78 స్ట్రైక్ రేట్‌తో 101 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్‌లో ఒక భారతీయ బ్యాట్స్‌మన్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది. టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.
వైభవ్ సూర్యవంశీ సంచలనం..
అయితే, ఇలాంటి తుఫాన్ బ్యాటింగ్ ఉన్నప్పటికీ, అతను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అనుభవజ్ఞులు విశ్వసిస్తున్నారు. బౌలర్లు ఇప్పుడు అతనిపై వ్యూహాలు రచిస్తున్నందున, వచ్చే సీజన్ వరకు వైభవ్ మరింత అనుభవాన్ని పొందాలని సునీల్ గవాస్కర్ సూచించారు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్, అండర్-19 క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడం ద్వారా చిన్న వయసులోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ అతనిని మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో IPLలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








