IPL: కీలక నిర్ణయం తీసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. జట్టు ప్రధాన కోచ్‌ను తొలగిస్తూ ప్రకటన…

Rajasthan Royals Coach Steps Down: ఐపీఎల్‌ 2021 కోసం చెన్నై వేదికగా జరిగిన మినీ వేలంపాటలో పలు సంచలనాలు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఏడాది అత్యధిక ధరకు..

IPL: కీలక నిర్ణయం తీసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. జట్టు ప్రధాన కోచ్‌ను తొలగిస్తూ ప్రకటన...
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 21, 2021 | 7:41 PM

Rajasthan Royals Coach Steps Down: ఐపీఎల్‌ 2021 కోసం చెన్నై వేదికగా జరిగిన మినీ వేలంపాటలో పలు సంచలనాలు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఏడాది అత్యధిక ధరకు ప్లేయర్స్‌ అమ్ముడుపోయారు. ఇక ఐపీఎల్‌ 2021 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను తొలగించినట్లు జట్టు ఆదివారం ప్రకటించింది. భారత మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ట్రెవర్‌ పెన్నీని సహాయ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్‌ 2021 వేలానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమితులైన మాజీ క్రికెటర్‌ కుమార సంగర్కరతో కలిసి పనిచేస్తాడని ఫ్రాంచైజీ పేర్కొంది. జట్టుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను సంగక్కర పర్యవేక్షిస్తున్నాడు. రాజస్థాన్‌ తమ కెప్టెన్‌గా యువ ఆటగాడు సంజు శాంసన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక రాజస్థాన్‌ రాయల్‌ జట్టు కోచింగ్‌ స్టాఫ్‌ విషయానికొస్తే.. స్పిల్‌ బౌలింగ్‌కు కోచ్‌గా సాయిరాజ్‌ బహతులే వ్యవహరిస్తుండగా, ఫాస్ట్‌ బౌలింగ్‌కు రాబ్‌ అసీల్‌ కోచ్‌గా ఉన్నారు. ఇక దిశాంత్‌ యాగ్నిక్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Also Read: SRH Auction Girl: కుర్రకారు హృదయాలను దోచేసిన మిస్టరీ లేడీ.. సన్‌రైజర్స్‌తో ఉన్న ఆమె ఎవరంటే.!