వరుణుడు కరుణిస్తాడా.. లేక కురిసేస్తాడా?

ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. అటు అభిమానులు, ఇటు సీనియర్ క్రికెటర్లు సైతం ప్రపంచకప్ షెడ్యూల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారనుందని తెలుస్తోంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటు శనివారం కూడా ఇదే పరిస్థితి […]

వరుణుడు కరుణిస్తాడా.. లేక కురిసేస్తాడా?
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 15, 2019 | 8:27 AM

ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. అటు అభిమానులు, ఇటు సీనియర్ క్రికెటర్లు సైతం ప్రపంచకప్ షెడ్యూల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారనుందని తెలుస్తోంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటు శనివారం కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని వారు ప్రకటించారు. దీంతో ఇవాళ జరిగే ఆస్ట్రేలియా- శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది.