భారత్, పాక్ మ్యాచ్ రద్దయితే కోట్లు నష్టం!
ప్రపంచకప్ జరుగుతున్న మ్యాచ్‌లకు వరుణుడు తీవ్ర అడ్డంకిగా మారాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తిగా వర్షార్పణం కాగా.. ప్రపంచకప్‌లోనే అత్యధిక ప్రేక్షకాదరణ పొందే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా వరుణుడు మరోసారి అడ్డు తగలనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగి మ్యాచ్ రద్దయితే ఇరు దేశ అభిమానుల నుంచి వచ్చే అసహనాన్ని లెక్కగట్టలేం. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో రేపు జరగాల్సిన ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం ప్రకటనల ద్వారా 137.5 కోట్లు నష్టం రానుందని క్రికెట్ […]
ప్రపంచకప్ జరుగుతున్న మ్యాచ్‌లకు వరుణుడు తీవ్ర అడ్డంకిగా మారాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తిగా వర్షార్పణం కాగా.. ప్రపంచకప్‌లోనే అత్యధిక ప్రేక్షకాదరణ పొందే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా వరుణుడు మరోసారి అడ్డు తగలనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగి మ్యాచ్ రద్దయితే ఇరు దేశ అభిమానుల నుంచి వచ్చే అసహనాన్ని లెక్కగట్టలేం.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో రేపు జరగాల్సిన ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం ప్రకటనల ద్వారా 137.5 కోట్లు నష్టం రానుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రసారాలకై స్టార్ స్పోర్ట్స్, ప్రకటనలకై కోకాకోలా, ఉబర్, వన్ ప్లస్, ఎంఆర్ఎఫ్ టైర్స్ పెద్ద మొత్తంలో సొమ్మును వెచ్చిస్తున్నాయని సమాచారం. మరి వరుణుడు కరుణిస్తాడో లేదో వేచి చూడాలి.