సఫారీలకు చావో.. రేవో.!

వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు టోర్నీలో విజయం సాధించని దక్షిణాఫ్రికా జట్టు కార్డిఫ్ వేదిక ఆఫ్ఘనిస్థాన్‌తో తలబడనుంది. సెమీస్ ఆశలు నిలవాలంటే దక్షిణాఫ్రికా మిగిలిన ఐదు మ్యాచ్‌లు గెలిచి తీరాల్సిన పరిస్థితి. మరోవైపు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరన ఉన్న ఆఫ్ఘనిస్థాన్.. ఇవాళ్టి మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు లండన్‌లోని ఓవల్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. […]

సఫారీలకు చావో.. రేవో.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 15, 2019 | 8:59 AM

వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు టోర్నీలో విజయం సాధించని దక్షిణాఫ్రికా జట్టు కార్డిఫ్ వేదిక ఆఫ్ఘనిస్థాన్‌తో తలబడనుంది. సెమీస్ ఆశలు నిలవాలంటే దక్షిణాఫ్రికా మిగిలిన ఐదు మ్యాచ్‌లు గెలిచి తీరాల్సిన పరిస్థితి. మరోవైపు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరన ఉన్న ఆఫ్ఘనిస్థాన్.. ఇవాళ్టి మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

అటు లండన్‌లోని ఓవల్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి సేఫ్ జోన్‌లో ఉండాలని భావిస్తోంది.