Chris Gayle: ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న పంజాబ్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌.. కారణమేంటో తెలుసా.?

Chris Gayle: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడుతోన్న క్రిస్‌ గేల్‌ మిగిలిన మ్యాచ్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చాలా కాలంగా బయో బబుల్‌లో ఉంటుండంతో మానసికంగా బాగా అలసిపోయానన్న గేల్‌..

Chris Gayle: ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న పంజాబ్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌.. కారణమేంటో తెలుసా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 01, 2021 | 9:02 AM

Chris Gayle: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడుతోన్న క్రిస్‌ గేల్‌ మిగిలిన మ్యాచ్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చాలా కాలంగా బయో బబుల్‌లో ఉంటుండంతో మానసికంగా బాగా అలసిపోయానన్న గేల్‌.. విరామం తీసుకునేందుకు ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ‘పంజాబ్‌ కింగ్స్‌ గేల్‌ను గౌరవిస్తోంది అలాగే అతను తీసుకున్న నిర్ణయానికి మద్ధతు ఇస్తోంది. రానున్న టీ20 వరల్డ్‌ కప్‌లో గేల్‌ మంచి ప్రతిభను కనబరచాలని కోరుకుంటున్నాము’ అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో చాలా కాలంపాటు బయో బబుల్‌లో ఉంటుండడంతో అలసిపోయిన గేల్‌.. టి20 ప్రపంచకప్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు విరామం కోరుకుంటున్నానని తెలిపాడు. ఈ విషయమై ఆయన ఆ మాట్లాడుతూ.. ‘కొన్ని నెలలుగా కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బబుల్‌.. ఆ తర్వాత ఐపీఎల్‌ బబుల్‌లో ఉంటున్నాను. మానసిక పునరుత్తేజాన్నిపొందడానికి ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్‌లో పంజాబ్‌ తరపుణ 10 ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌ 193 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో గేల్‌ అత్యధిక స్కోర్‌ కేవలం 46 మాత్రమే కావడం గమనార్హం.

అసలేంటీ బయో బబుల్‌..

ప్లేయర్స్‌కు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన విధానమే ఈ బయోబబుల్‌. దీని ముఖ్య ఉద్దేశం బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సురక్షితంగా ఉండటం. ఈ బబుల్‌లోనికి ప్రవేశించాలంటే ముందుగా అందరూ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండటం తప్పనిసరి. క్వారంటైన్ ముగిసిన తర్వాత ప్రతీ ఒక్కరు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కరోనా నెగెటివ్ అని తేలితేనే వారిని బయోబబుల్‌లోనికి అడుగుపెట్టడానికి అనుమతిస్తారు.

Also Read: Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? పూర్తి వివరాలు

PM Narendra Modi: భారత సుస్థిరాభివృద్ధికి మరో రెండు కీలక పథకాలు.. నేడు ప్రధాని మోడీ శ్రీకారం..

IPL 2021 KKR vs PBKS Live Streaming: చక్రం తిప్పాల్సిన మ్యాచ్‌ను ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. చూడాలో తెలుసుకోండి