IPL 2021 KKR vs PBKS Live Streaming: చక్రం తిప్పాల్సిన మ్యాచ్‌ను ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. చూడాలో తెలుసుకోండి

పంజాబ్ కింగ్స్‌కు శుక్రవారం కేకేఆర్‌తో జరిగే మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే.. వారి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచడానికి పంజాబ్ ఈ మ్యాచ్‌ను..

IPL 2021 KKR vs PBKS Live Streaming: చక్రం తిప్పాల్సిన మ్యాచ్‌ను ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. చూడాలో తెలుసుకోండి
Punjab Kings
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 01, 2021 | 8:27 AM

మరో సంచలనానికి మ్యాచ్‌కు ఇవాళ తెరలేవబోతోంది. ఒకరిది ఓటమి తర్వాత విజయం కోసం పోరాటం.. మరొకరిది విజయోత్సాహం కొనసాగించడం.. ఈ రెండు జట్ల మధ్య సమరం జరుగనుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌కు శుక్రవారం కేకేఆర్‌తో జరిగే మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే.. వారి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచడానికి పంజాబ్ ఈ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. మరోవైపు కేకేఆర్‌ జట్టు రెండవ దశలో తిరిగి వచ్చినందుకు ఉత్సాహపడుతోంది. ఇది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు స్థానాల్లో ఉంది. కేకేఆర్‌ 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచింది. 10 పాయింట్లతో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉంది.

కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ప్లేఆఫ్ రేసులో ఉండటానికి ఇది ‘డు ఆర్ డై’ మ్యాచ్ కానుంది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తరువాత రాహుల్ ఒత్తిడిలో తన జట్టు సరిగ్గా ఆడటం లేదని.. వారు తమ ఆటతీరును మెరుగుపరుచుకోవాలని అంగీకరించారు. అయితే ప్రతి విజయంలో జట్టు కలిసి కట్టుగా ఆడితేనే సక్సెస్ అవుతుంది. అలాగే.. మిడిల్ ఆర్డర్ పేలవమైన రూపం కూడా జట్టు ఆటతీరును ప్రభావితం చేసింది. రాహుల్ (422 పరుగులు) మయాంక్ అగర్వాల్ (332) మినహా ఏ బ్యాట్స్‌మన్ కూడా ఆకట్టుకోలేకపోయాడు.

మరోవైపు పంజాబ్ తరపున బిష్ణోయ్ (తొమ్మిది వికెట్లు) మినహా ఏ బౌలర్ కూడా బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టలేక పోతున్నారు. మహమ్మద్ షమీ 14 వికెట్లు,  అర్షదీప్ సింగ్ 13 వికెట్లు తీశారు. కానీ రెండూ ఖరీదైనవిగా నిరూపించబడ్డాయి. KKR కోసం 144 ప్లస్ స్ట్రైక్ రేట్ వద్ద వెంకటేశ్ 126 పరుగులు చేశాడు. అతను షమీ, అర్షదీప్ మొదటి స్పెల్ ఆడితే అతను బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్‌ని ఎలా తీసుకుంటాడో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? అక్టోబర్ 1 శుక్రవారం పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.

పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.

పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ జరుగుతుంది? పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడతాయి. లైవ్ స్ట్రీమింగ్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.

పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. రాత్రి 7 గంటలకు టాస్ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:  SBI Car Loan: కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. జీరో ప్రాసెసింగ్ ఛార్జ్.. ఇంట్లో కూర్చుని తీసుకోండి..

TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..