IPL 2025: సరదా సరదాకే ఆమె అందర్నీ కొనేదామని చూస్తుంది.. ఇగా ముందుంది మెగా వేలం.. చూసుకో మళ్ళా..!
పంజాబ్ కింగ్స్ ఒక్కసారి టైటిల్ గెలవలేదు..ప్రతీ సీజన్ మ్యాచ్లో ఘెరంగా ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరిలో ఉండడం ఈ జట్టుకు సర్వసాధరణం.. కానీ ఈ సీజన్ పంజాబ్ కింగ్స్ అలా కనిపించడం లేదు.. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రీతిజింటా డిసైడ్ అయినట్లు ఉంది.
ఐపీఎల్ 2025 వేలం ఈ నవంబర్ చివర్లో జరగనుంది. ఈ సందర్భంగా అక్టోబర్31(గురువారం) రిటెన్షన్‌కు చివరి తేదీ కావడంతో అన్ని జట్లు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితను విడుదల చేశాయి. అయితే ఈ రిటెన్షన్లో అన్ని జట్లతో పొల్చితే పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్టు అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఆ రిటైన్ చేసుకున్న వాళ్లు కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే కావడం విశేషం. దీంతో ఆ జట్ట వద్దే ఎక్కువ పర్సు ఉంది. అయితే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్క ట్రోఫీ కూడా దక్కించుకొలేదు. ప్రతీ సీజన్‌లో మ్యాచ్‌లు ఓడిపోవడం పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉండడం పంజాబ్‌కి అలవాటైంది. కానీ ఈసారి పంజాబ్ కింగ్స్ రూట్ మార్చింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ప్రణాళికతో రిటెన్షన్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో శశాంక్ సింగ్ రూ.5.5 కోట్లు, ప్రభుసిమ్రాన్ సింగ్ రూ.4 కోట్లుతో రిటైన్ చేసుకున్నారు. పంజాబ్ కొత్త హెడ్ కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌తో ప్రీతిజింటా తీవ్రంగా చర్చించి జట్టును పూర్తి ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పంజాబ్ వద్ద రూ.110.5 కోట్లు పర్సు మిగిలి ఉంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో ఈ విషయంపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. సరదా సరదాకే ఆమె అందర్నీ కొనేదామని చూస్తుంది.. ఇగా ముందుంది మెగా వేలం.. చూసుకో మళ్ళా..! అని కామెంట్లు పెడుతున్నారు.
IPL జట్ల పర్సు ఇలా ఉంది:
చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 55 కోట్లు
ముంబై ఇండియన్స్ – రూ. 45 కోట్లు
కోల్ కతా నైట్ రైడర్స్ – రూ. 51 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ – రూ. 41 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ. 45 కోట్లు
గుజరాత్ టైటాన్స్ – రూ. 69 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 83 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 73 కోటి
పంజాబ్ కింగ్స్ – రూ. 110.5 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 69 కోట్లు