IPL 2023: 44 బంతుల్లో సెంచరీ.. 20 ఫోర్లు, 5 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. ఢిల్లీ ప్లేయర్ భీకర ఊచకోత..

సాధారణంగా టీ20 క్రికెట్‌లో 200 పరుగులు టార్గెట్ చేధించాలంటేనే చాలా కష్టం. మరి 245 పరుగుల లక్ష్యచేధన అంటే.. ఇంకేమైనా ఉందా.?

IPL 2023: 44 బంతుల్లో సెంచరీ.. 20 ఫోర్లు, 5 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. ఢిల్లీ ప్లేయర్ భీకర ఊచకోత..
Cricket
Follow us

|

Updated on: Mar 09, 2023 | 10:09 AM

సాధారణంగా టీ20 క్రికెట్‌లో 200 పరుగులు టార్గెట్ చేధించాలంటేనే చాలా కష్టం. మరి 245 పరుగుల లక్ష్యచేధన అంటే.. ఇంకేమైనా ఉందా.? చేధించే జట్టు ఓడిపోక తప్పదని అంటారా.? అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది క్వెట్టా గ్లాడియేటర్స్. బుధవారం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పరుగుల వరద పారింది. టీ20 క్రికెట్‌లో అరుదుగా రికార్డు బ్రేక్ అయింది. ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ నమోదైంది. పీఎస్‌ఎల్‌లో బాబర్ అజామ్ తొలి సెంచరీ నమోదు బాదేయగా.. జాసన్ రాయ్ సుడిగాలి ఇన్నింగ్స్ బాదేశాడు. క్వెట్టా గ్లాడియేటర్స్‌ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్‌గా వచ్చిన ఇంగ్లాండ్ వెటరన్ బ్యాట్స్‌మెన్ జాసన్ రాయ్.. PSL చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్‌ ఆడి రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ విధ్వంసకర బ్యాటర్ 63 బంతుల్లో అజేయంగా 145 పరుగులు చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

పెషావర్ జల్మీ విధించిన 241 పరుగుల భారీ లక్ష్యానికి చేధించే క్రమంలో, రాయ్ కేవలం 44 బంతుల్లోనే తుఫాన్ సెంచరీని పూర్తి చేశాడు, అంతేకాకుండా చివరి వరకు నాటౌట్‌గా నిలిచి 10 బంతులు మిగిలి ఉండగానే తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ సమయంలో రాయ్ 20 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అలాగే రాయ్‌తో పాటు మహ్మద్ హఫీజ్ కూడా 41 పరుగులు చేసి జట్టు విజయంలో సహాయపడ్డాడు. వీరిద్దరూ కేవలం 39 బంతుల్లో అజేయంగా 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. లక్ష్యాన్ని సులభం చేశారు. కాగా, ఈ లక్ష్యచేధన పీఎస్‌ఎల్‌లోనే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో కూడా అతిపెద్దది. ఈ మ్యాచ్‌లో మొత్తం 483 పరుగులు నమోదయ్యాయి.

అంతకుముందు పెషావర్ తరఫున కెప్టెన్ బాబర్ అజామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అజేయంగా 115 పరుగులు(65 బంతులు, 15 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. పీఎస్‌ఎల్ చరిత్రలో అతడికి ఇదే తొలి సెంచరీ. అయినప్పటికీ, జట్టుకు ఇది సరిపోలేదు. బాబర్‌తో పాటు, పెషావర్‌లో సైమ్ అయూబ్ కూడా 74 పరుగులు (34 బంతులు, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు.