IPL 2024:’ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం’.. సంచలన వార్తపై ఫ్రాంచైజీ ఏమందంటే?
ఈ మెగా వేలంపై మరింత ఆసక్తి కలగ డానికి కారణం రోహిత్ శర్మ. ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ సింగిల్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. గత పదేళ్లుగా ముంబై జట్టుకు కెప్టెన్‌గా కనిపించిన హిట్ మ్యాన్ ను ఈసారి కెప్టెన్సీ నుంచి తప్పించింది ముంబై ఫ్రాంచైజీ.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్-17 ముగియకముందే, ఐపీఎల్ మెగా వేలం చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లలో చాలా మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే ఐపీఎల్ మెగా యాక్షన్ రూల్ ప్రకారం కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే జట్టులో రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మెగా వేలంపై మరింత ఆసక్తి కలగ డానికి కారణం రోహిత్ శర్మ. ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ సింగిల్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. గత పదేళ్లుగా ముంబై జట్టుకు కెప్టెన్‌గా కనిపించిన హిట్ మ్యాన్ ను ఈసారి కెప్టెన్సీ నుంచి తప్పించింది ముంబై ఫ్రాంచైజీ. ప్రస్తుతం అతనికి బదులుగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అందుకే రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబై ఇండియన్స్‌కు ఆడడని వార్తలు వచ్చాయి. ఈ వార్తల మధ్య, IPL 2025లో పంజాబ్ కింగ్స్ జట్టుకు హిట్‌మ్యాన్ నాయకత్వం వహిస్తాడనే వార్త వైరల్‌గా మారింది.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా రోహిత్ శర్మతో మాట్లాడడమే ఈ వార్త వైరల్ కావడానికి ప్రధాన కారణం. వీరి ముచ్చట్ల తర్వాతే హిట్‌మ్యాన్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ఆడనున్నాడనే వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు ఈ రూమర్స్ పై ప్రీతీ జింటా స్వయంగా స్పందించింది. ‘ప్రస్తుతం వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైన, తప్పుడు వార్తలు. రోహిత్ శర్మ అంటే నాకు చాలా గౌరవం. నేను ఆయనకు పెద్ద అభిమానిని. కానీ పంజాబ్ కింగ్స్ జట్టులో చేరడం గురించి నేను అతనితో చర్చించలేదు లేదా అలాంటి ప్రకటన చేయలేదు. మా టీమ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అంటే నాకు చాలా గౌరవం. ఇప్పుడు మా జట్టు చాలా బాగుంది. ప్రస్తుతం మా దృష్టంతా ఐపీఎల్ టైటిల్ గెలవడంపైనే ఉంది. కాబట్టి ఇలాంటి వార్తలను నమ్మవద్దు’ అని ప్రీతి జింటా సామాజిక మాధ్యమాల వేదికగా కోరింది.
ప్రీతి జింటా ట్వీట్..
#Fakenews ! All these articles are completely fake & baseless. I hold Rohit Sharma in very high regard & am a big fan of his, but I have NEVER DISCUSSED him in any interview nor made this STATEMENT ! I also have a lot of respect for Shikhar Dhawan & he being currently injured ,… pic.twitter.com/VYbyV4eqHU
— Preity G Zinta (@realpreityzinta) April 19, 2024
IPL 2025 కోసం మెగా వేలం ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ ముందు విడుదల చేస్తే, అతను వేలంలోకి రావొచ్చు. ఈ సమయంలో, కొన్ని ఫ్రాంచైజీలు హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తద్వారా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు.
శశాంక్ సింగ్ తో ప్రీతి..
Today seems like the perfect day to finally talk about things that were said in the past about us at the auction. A lot of people in similar situations would have lost confidence, buckled under pressure or become de-motivated ……. but not Shashank ! He is not like a lot of… pic.twitter.com/OAPfLFKwxq
— Preity G Zinta (@realpreityzinta) April 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




