PBKS, IPL 2022 Auction: 23 మందితో తొలి ట్రోఫీ కోసం సిద్ధమైన పంజాబ్ కింగ్స్.. పూర్తి జాబితా ఇదే..
Punjab Kings Auction Players: ఐపీఎల్ కోసం జరిగిన మెగా వేలంలో పంజాబ్ జట్టు పలువురు వెటరన్, యువ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కోట్లాది రూపాయలను వెచ్చించినా.. మంచి స్క్వాడ్‌ను తయారు చేసింది.
రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా(IPL 2022 Auction) వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. కోల్‌కతా, చెన్నై, ముంబై, పంజాబ్‌లు ఒక్కొక్కరు 25 మంది ఆటగాళ్ల గరిష్ట కోటాను పూర్తి చేశాయి. లక్నో జట్టులో కేవలం 21 మంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఇతర జట్లలో గుజరాత్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 ప్లేయర్లు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 24 ప్లేయర్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 22 మంది ఆటగాళ్లను కలిగి ఉన్నాయి. వేలానికి ముందు ప్రతి జట్టులో 2 నుంచి 4గురు ఆటగాళ్లు రిటైన్ అయ్యారు. అంటే రెండు రోజుల వేలంలో చెన్నై, ముంబై, కోల్ కతా, రాజస్థాన్ 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. పంజాబ్(Punjab Kings) 23, ఢిల్లీ, గుజరాత్, హైదరాబాద్ 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. బెంగళూరు 19 మంది ఆటగాళ్లను, లక్నో 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అదే సమయంలో ఐపీఎల్(IPL) నిబంధనల ప్రకారం, ప్రతి జట్టులో కనీసం 18, గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. వేలం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ లిస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం.
IPL 2022 కోసం జరిగిన మెగా వేలంలో, 10 జట్లు పాల్గొని వందలాది మంది ఆటగాళ్లపై పందెం కాశాయి. ఈసారి వేలంలో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు కూడా కోట్ల రూపాయల వర్షం కురిపించి ఆటగాళ్లందరినీ కలుపుకుంది. జట్టు కొన్ని నెలల క్రితం ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లను రిటైన్ చేయగా, మిగిలిన ఆటగాళ్లు విడుదలయ్యారు. వేలంలో కొంతమంది పాత ఆటగాళ్లను కూడా జట్టు కొనుగోలు చేసింది. జట్టు ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.. వారి కోసం ఎంత డబ్బు వెచ్చించిందో ఇప్పుడు చూద్దాం.
వేలంలో పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న ఆటగాళ్లు..
షారుక్ ఖాన్ – రూ.9 కోట్లు
శిఖర్ ధావన్ – రూ. 8.25 కోట్లు
కగిసో రబడ – రూ. 9.25 కోట్లు
జానీ బెయిర్‌స్టో – రూ. 6.75 కోట్లు
రాహుల్ చాహర్ – రూ. 5.25 కోట్లు
హర్‌ప్రీత్ బ్రార్ – రూ. 3.80 కోట్లు
ప్రభసిమ్రాన్ సింగ్ – రూ. 60 లక్షలు
జితేష్ శర్మ – రూ. 20 లక్షలు
ఇషాన్ పోరెల్ – రూ. 25 లక్షలు
లియామ్ లివింగ్‌స్టోన్ – రూ. 11.50 కోట్లు
ఒడియన్ స్మిత్ – రూ. 6 కోట్లు
సందీప్ శర్మ – రూ. 50 లక్షలు
రాజ్ అంగద్ బావా – రూ. 2 కోట్లు
రిషి ధావన్ – రూ. 55 లక్షలు
ప్రేరక్ మన్కడ్ – రూ. 20 లక్షలు
వైభవ్ అరోరా – రూ. 2 కోట్లు
రిత్తిక్ ఛటర్జీ – రూ. 20 లక్షలు
బల్తేజ్ దండా – రూ. 20 లక్షలు
అన్ష్ పటేల్ – రూ. 20 లక్షలు
నాథన్ ఎల్లిస్ – రూ. 75 లక్షలు
అథర్వ తాడే – రూ. 20 లక్షలు
భానుక రాజపక్సే – రూ. 50 లక్షలు
బెన్నీ హోవెల్ – రూ. 40 లక్షలు
పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లు..
మయాంక్ అగర్వాల్- రూ. 12 కోట్లు
అర్ష్‌దీప్ సింగ్ – రూ. 4 కోట్లు