Video: ఏంది బాసూ.. ఈ బీభత్సం.. 6 సిక్సులు, 13 ఫోర్లతో ఊచకోత.. కరాచీలో బౌలర్లను కన్నీళ్లు పెట్టించిన విధ్వంసం..

T20 Cricket: 50 బంతుల్లో 92 పరుగులు చేసి 79 నిమిషాల పాటు క్రీజులో నిలిచాడు. ఇందులో 6 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. అంటే, టామ్ కోహ్లర్ తన ఇన్నింగ్స్‌లో కేవలం 13 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లతో 64 పరుగులు చేశాడు.

Video: ఏంది బాసూ.. ఈ బీభత్సం.. 6 సిక్సులు, 13 ఫోర్లతో ఊచకోత.. కరాచీలో బౌలర్లను కన్నీళ్లు పెట్టించిన విధ్వంసం..
Psl 2023 tom-kohler-cadmore
Follow us
Venkata Chari

|

Updated on: Feb 15, 2023 | 9:58 AM

పాకిస్థాన్ సూపర్ లీగ్ 8వ సీజన్ రెండో మ్యాచ్‌లో ఓ అద్బుతం జరిగింది. దీనికి కారణం 28 ఏళ్ల బ్యాట్స్‌మన్. అతను కరాచీలోని నేషనల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామ్ కోహ్లర్ పాకిస్థాన్ గడ్డపై నిలబడి 6 సిక్సర్లు కొట్టాడు. అయితే, సెంచరీ మిస్ చేసుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 8వ సీజన్ రెండో మ్యాచ్ పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా కరాచీ కింగ్స్ 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా ప్రయత్నించింది. కానీ, విజయానికి 2 పరుగుల దూరంలో మిగిలిపోయింది. అంటే 20 ఓవర్లలో 197 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పెషావర్ జల్మీ విజయంలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ కీలక పాత్ర..

పెషావర్ జల్మీ విజయంలో బ్యాట్స్‌మెన్ టామ్ కోహ్లర్, కెప్టెన్ బాబర్ ఆజం కీలక పాత్ర పోషించారు. టామ్ కోహ్లర్ కరాచీ కింగ్స్ బౌలర్లను చీల్చి చెండాడాడు. 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ మొదటి బంతి నుంచే తన ఉద్దేశాలను వ్యక్తం చేశాడు. 50 బంతుల్లో 92 పరుగులు చేసి 79 నిమిషాల పాటు క్రీజులో నిలిచాడు. ఇందులో 6 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. అంటే, టామ్ కోహ్లర్ తన ఇన్నింగ్స్‌లో కేవలం 13 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లతో 64 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

బాబర్ కూడా..

అలాగే, బాబర్ ఆజం కూడా 46 బంతులు ఎదుర్కొని 68 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 66 నిమిషాల్లో వికెట్‌పై స్థిరపడిన బాబర్.. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో చెలరేగిపోయాడు.

ఇమాద్ వసీమ్ 47 బంతుల్లో 80 పరుగులు చేసినా ఫలితం లేదు..

పెషావర్ జల్మీ తుఫాన్ ఇన్నింగ్స్‌కు కరాచీ కింగ్స్ బ్యాట్స్‌మెన్స్ వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో విజయం సాధించలేక చతికిల పడింది. కెప్టెన్ ఇమాద్ వసీమ్ 47 బంతుల్లో 80 పరుగులు చేసినా.. ఫలితం లేకపోయింది. అదే సమయంలో షోయబ్ మాలిక్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. కానీ, చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండగా, 14 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..