AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara- Shubman Gill: వాలంటైన్స్‌డే నాడు ఒకే హోటల్‌లో గిల్‌- సారా.. వైరల్‌గా మారిన ఫొటోలు.. ట్విస్ట్ ఏంటంటే?

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌తో గిల్‌ డేటింగ్‌లో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎప్పుడు జంటగా కనిపించలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు రియాక్ట్ అవుతున్నారు.. లైకులు కొట్టుకుంటున్నారు.

Sara- Shubman Gill: వాలంటైన్స్‌డే నాడు ఒకే హోటల్‌లో గిల్‌- సారా.. వైరల్‌గా మారిన ఫొటోలు.. ట్విస్ట్ ఏంటంటే?
Gill, Sara Tendulkar
Basha Shek
|

Updated on: Feb 15, 2023 | 11:16 AM

Share

టీమిండియా యంగ్ సెన్సేషన్‌ శుభ్‌మన్‌ గిల్‌ క్రికెట్‌తో పాటు ఇతర విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా తన రిలేషన్‌షిప్‌కు సంబంధించి నిత్యం న్యూస్‌లో ఉంటాడీ యంగ్‌ క్రికెటర్‌. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌తో గిల్‌ డేటింగ్‌లో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎప్పుడు జంటగా కనిపించలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు రియాక్ట్ అవుతున్నారు.. లైకులు కొట్టుకుంటున్నారు. దీంతో ఇద్దరూ డేటింగ్ లో లవ్ లో ఉన్నారంటూ కథనాలు గుప్పుమంటున్నాయి. ఇటీవల గిల్‌..న్యూజీల్యాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీల వర్షం కురిపించినప్పుడు కూడా సారా, సచిన్‌లను ఇన్వాల్వ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.తాజాగా వాలంటైన్స్‌డే నాడు సారా, గిల్‌ షేర్‌ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఫొట్లోలో కనిపిస్తున్న హోటల్ వాతావరణం, బ్యాక్‌గ్రౌండ్‌ చూసి ఇద్దరు ఒకే హోటల్ లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. అయితే.. ఆ హోటల్‌లో సారా దిగిన ఫొటో రెండేళ్ల క్రితంది కావడం గమనార్హం. 2021 జులైలో సారా పోస్ట్ చేయగా.. ఈరోజు గిల్ అదే హోటల్ లో దిగిన పిక్ పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సారా- గిల్‌లు ఇద్దరూ కలిసి వెళ్లారని.. వాలెంటైన్స్ డే కలిసి జరుపుకున్నారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీరి ఫొటోలు షేర్‌ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫొటోలు పాతవే. కానీ.. అప్పుడు దిగిన పిక్‌ను గిల్ ఇప్పుడు షేర్ చేసి ఉండొచ్చు కదా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరి ఇందులో నిజమెంతుందో వారికే తెలియాలి. కాగా గిల్‌ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అయితే మొదటి టెస్ట్‌లో ఆడలేదు. మరి రెండో టెస్టులోనైనా ఛాన్స్‌ లభిస్తుందేమో చూడాలి. ఈనెల 17 నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్
పవన్ కల్యాణ్‌ కోసం మహేష్‌బాబు చేసిన పని ఏంటో తెలుసా
పవన్ కల్యాణ్‌ కోసం మహేష్‌బాబు చేసిన పని ఏంటో తెలుసా