బాంబ్ బ్లాస్ట్‌లో గాయపడ్డ మసూద్ అజార్..?

పాకిస్తాన్‌లోని రావల్పిండి ఆసుపత్రిలో సోమవారం జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్లాస్ట్‌లో మొత్తం 10మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుండగా.. వారిలో అజర్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు గాయపడ్డ వారందరినీ ఎమెర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో  ద్వారా తెలిపాడు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో రావల్పిండిలోని ఆసుపత్రి నడుస్తోంది. […]

బాంబ్ బ్లాస్ట్‌లో గాయపడ్డ మసూద్ అజార్..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 25, 2019 | 10:46 AM

పాకిస్తాన్‌లోని రావల్పిండి ఆసుపత్రిలో సోమవారం జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్లాస్ట్‌లో మొత్తం 10మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుండగా.. వారిలో అజర్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు గాయపడ్డ వారందరినీ ఎమెర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో  ద్వారా తెలిపాడు.

అయితే పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో రావల్పిండిలోని ఆసుపత్రి నడుస్తోంది. డయాలసిస్‌తో బాధపడుతోన్న అజర్.. తరచుగా ఆ ఆసుపత్రికి వెళ్తుంటారని చెబుతుంటారు. ఈ క్రమంలో సోమవారం బ్లాస్ట్ జరిగిన సమయంలో అతడు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత నిఘా సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. కాగా బాలాకోట్‌లో భారత సైన్యం దాడుల అనంతరం అజర్‌ను పాక్ సైన్యం సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.