పాక్ వద్దు పొమ్మంది.. కట్ చేస్తే.. 83 ఫోర్లు, 10 సిక్సర్లతో ఇంగ్లాండ్‌లో తేలిన ప్లేయర్.. ఎవరంటే.?
తన జట్టులో చోటు ఇచ్చి తప్పు చేశామని పాకిస్తాన్ ఈ ఆటగాడిని వద్దు పొమ్మంది.. కట్ చేస్తే.. ఇంగ్లాండ్‌లో తేలాడు. తన సత్తా చాటాడు. ఏకంగా నాలుగు సెంచరీలతో కదంతొక్కాడు. మరి ఆ బ్యాటర్ ఎవరు.? ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందామా..

అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న కొందరు ఆటగాళ్లు నిలకడలేమి కారణంగా జట్టులో తమ చోటును కోల్పోతుంటారు. సరిగ్గా ఈ ఆటగాడి పరిస్థితి కూడా అంతే.! పాకిస్తాన్ వన్డే, టెస్టు జట్టులో ఓపెనర్‌గా చోటు సంపాదించుకున్నాడు. కట్ చేస్తే.! నిలకడలేమితో తన స్థానాన్ని కోల్పోయాడు. అయితే ఆ ఆటగాడు మరో దేశంలో తన సత్తా చాటాడు. ఆగష్టు 5 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగే ఇంగ్లాండ్ డొమెస్టిక్ వన్డే కప్‌లో పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా లీగ్ స్టేజిలో 74 మ్యాచ్‌లు పూర్తి కాగా.. ఇమామ్ సెకండ్ టాప్ స్కోరర్‌గా లిస్టులో నిలిచాడు. ఇక ఆదివారం జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. కానీ తన జట్టును ఫైనల్ చేర్చలేకపోయాడు.
ఈ టోర్నీలో ఇమామ్ ఉల్ హాక్ మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడగా.. 97.45 స్ట్రైక్ రేటుతో 688 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఇమామ్ బ్యాట్ నుంచి 83 ఫోర్లు, 10 సిక్సర్లు వచ్చాయి. యార్క్ షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇమామ్ ఉల్ హాక్.. ఈ టోర్నీలో తన మార్క్ చూపించాడు. లీగ్ స్టేజిలో ఆడిన 8 మ్యాచ్‌లు ఏడింట విజయం సాధించిన యార్క్ షైర్.. సెమీఫైనల్‌లో హాంప్‌షైర్‌తో తలబడింది. ఇదే ఇమామ్ ఈ టోర్నీలో ఆడే చివరి మ్యాచ్. ఇక చివరి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఇమామ్ తన జట్టును మాత్రం ఫైనల్ చేర్చలేకపోయాడు. 305 పరుగుల లక్ష్యచేదనలో భాగంగా యార్క్ షైర్ జట్టు తడబడింది. ఆ జట్టులో ఇమామ్ సెంచరీ చేయగా, మిడిలార్డర్ బ్యాటర్ లక్స్‌టన్ 30 పరుగులు చేశాడు. దీంతో 18 పరుగుల తేడాతో హాంప్‌షైర్ విజయం సాధించి.. ఫైనల్స్‌కు చేరింది. కాగా, పాకిస్తాన్ తరపున 75 వన్డేలు ఆడిన ఇమామ్ 20 ఫిఫ్టీలు, 9 సెంచరీలతో 3152 పరుగులు చేశాడు.
N̶e̶v̶e̶r̶ fall in love with an overseas 💙
It’s been special, Imam 👑 pic.twitter.com/y4eaLRNnsN
— Yorkshire CCC (@YorkshireCCC) August 31, 2025




