T20 World Cup: యూఏఈలో పొట్టి ప్రపంచకప్.. పాకిస్థాన్‌ కే అవకాశాలు ఎక్కువ: కమ్రాన్ అక్మల్

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ యూఏఈ వేదికగా జరగనుంది. ఈమేరకు బీసీసీఐ షెడ్యూల్ తయారుచేసి ఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది.

T20 World Cup: యూఏఈలో పొట్టి ప్రపంచకప్.. పాకిస్థాన్‌ కే అవకాశాలు ఎక్కువ: కమ్రాన్ అక్మల్
Kamran Akmal
Follow us
Venkata Chari

|

Updated on: Jun 29, 2021 | 2:29 PM

T20 World Cup: ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ యూఏఈ వేదికగా జరగనుంది. ఈమేరకు బీసీసీఐ ఐసీసీకి షెడ్యూల్ పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో యూఏఈలో పొట్టి ప్రపంచ కప్ నిర్వహించడం పాకిస్థాన్‌ కి బాగా కలిసివస్తుందని పాకిస్థాన్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ కరోనాతో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా యూఏఈలో పలు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి పిచ్‌లపై పాకిస్తాన్‌కే ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. ‘‘టీ20 వరల్డ్‌కప్‌ యూఏఈ వేదికగా జరగడం పాకిస్థాన్‌కే మంచిది. గత 10 ఏళ్లుగా యూఏఈ వేదికగానే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడుతున్నాం. మిగిలిన జట్లతో పోలిస్తే యూఏఈ పిచ్‌లపై పాకిస్థాన్‌ టీమ్‌కే ఎక్కువ అనుభవం ఉంది’’ అని కమ్రాన్ పేర్కొన్నాడు.

2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో కొంతమంది క్రికెటర్లకు గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి పాకిస్తాన్‌లో ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు పర్యటించేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో యూఏఈలో ఇంటర్నేషనల్ మ్యాచులను ఆడుతోంది పాకిస్తాన్.

టీ20 ప్రపంచ కప్‌ ను అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో మొదలు కానుంది. అలాగే నవంబర్ 14న ఫైనల్ జరగనుంది. ఈమేరకు బీసీసీఐ షెడ్యూల్‌ తయారు చేసిందని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి తన నిర్ణయాన్ని తెలియజేనుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మొత్తం 16 దేశాలు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. యూఏఈలోని మూడు వేదికలు – అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు నిర్వహించనున్నారు. అలాగే టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లకు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

Also Read:

వీడెవడో అసాధ్యుడు! డివిలియర్స్‌లాగే సుడిగాలి ఇన్నింగ్స్.. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సూపర్ ఫాస్ట్ సెంచరీ..

Virat Kohli – Kane Williamson: అందుకే విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న..! విలియమ్సన్‌

Wimbledon 2021 Day 1 Highlights: గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్‌కు ఊహించని ఫలితం; జకోవిచ్, సబలెంక శుభారంభం!