IND vs ENG 2021: ఇదే టీమిండియా బెస్ట్‌ ఓపెనింగ్ జోడీ: ఆకాశ్ చోప్రా

ఇంగ్లాండ్‌తో ఆగస్టులో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది టీమిండియా. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ టెస్టు సిరీస్‌ జరగనుంది.

IND vs ENG 2021: ఇదే టీమిండియా బెస్ట్‌ ఓపెనింగ్ జోడీ: ఆకాశ్ చోప్రా
Shubman Gill And Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jun 29, 2021 | 5:22 PM

IND vs ENG 2021: ఇంగ్లాండ్‌తో ఆగస్టులో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది టీమిండియా. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ టెస్టు సిరీస్‌ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తరువాత టీమిండియాపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు కోహ్లీ కూడా జట్టు సభ్యులపై తీవ్రంగానే స్పందించారు. అలాగే మాజీలు కూడా పలు విమర్శలు చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ బరిలోకి దిగారు. వీరిద్దరు బాగానే ఆడినా.. మంచి ఆరంభాలను అందించలేకపోయారు. ఈ మేరకు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ఓపెనింగ్ జోడీని మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఓపెనింగ్ జోడీపై చర్చ ఊపందుకొంది.

భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓపెనింగ్ జోడీని సూచించాడు. “ఇంగ్లాండ్‌తో ఫస్ట్ టెస్టులో శుభమన్ గిల్‌ని తప్పకుండా బరిలోకి దించాలి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ ని ఓపెనింగ్ జోడీగా పంపాలని అంటున్నారు. రాహుల్ కంటే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అయితే బావుటుంది. నా అంచనా ప్రకారం రోహిత్ శర్మ, శుభమన్ గిల్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ. తొలి టెస్టులో ఈ జోడీనే బరిలోకి దించాలి” అని సూచించాడు. ఇటీవల ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ 34, గిల్ 28 పరుగులు చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు వరుసగా 30, 8 పరుగులు మాత్రమే సాధించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విఫలమైనందున ఈ జోడిని మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.

భారత జట్టు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అయితే సెకండ్ వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా జరిగే తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. తొలిటెస్టు ఆగ‌స్ట్ 4-8 వరకు జరగనుండగా, ఆగ‌స్ట్ 12-16 రెండో టెస్ట్‌, ఆగ‌స్ట్ 25-29 మూడో టెస్ట్, సెప్టెంబ‌ర్ 2-6 నాలుగో టెస్ట్‌, సెప్టెంబ‌ర్ 10-14 ఐదో టెస్ట్‌ లో ఇరుజట్టు తలపడనున్నాయి. ఈ సిరీస్ లో సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమి నుంచి త్వరగా బయటపడేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం లండర్ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న ఆటగాళ్లు.. జులై రెండో వారంలో బుడగలోకి చేరనున్నారు.

Also Read:

T20 World Cup: యూఏఈలో పొట్టి ప్రపంచకప్.. పాకిస్థాన్‌ కే అవకాశాలు ఎక్కువ: కమ్రాన్ అక్మల్

వీడెవడో అసాధ్యుడు! డివిలియర్స్‌లాగే సుడిగాలి ఇన్నింగ్స్.. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సూపర్ ఫాస్ట్ సెంచరీ..