
చెత్త ఆట తీరుతో దేశం పరువు తీశాడు. కెప్టెన్ బాబర్ ఆజాంపై మండిపడుతున్నారు పాకిస్తానీలు. ఇదే సమయంలో కోహ్లీని పొగిడేస్తున్నారు. దీపావళి నాడు జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా అదిరిపోయే శుభారంభం చేయడం పాకిస్తాన్‌ను నిరాశకు గురి చేసింది. ఉత్కంఠగా సాగిన ఈ సూపర్-12 మ్యాచ్‌లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పాక్ క్రికెట్ అభిమానులు. వీరి ఆగ్రహమంతా కెప్టెన్ బాబర్ ఆజామ్ మీదకు మరలింది. టీమ్‌ను నడిపించడం చేతకాకపోతే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిదని పాక్ మాజీ క్రికెట్ ప్లేయర్ సలీం మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజామ్ ఆట తీరుపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్నా జట్టును సమర్థంగా నడిపించలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు సలీం మాలిక్. గతంలో ఎంతో మంది ప్లేయర్స్ తప్పుకున్నారని గుర్తు చేశారు.
మరోవైపు తమ ప్లేయర్స్‌కు మ్యాచ్ మీద శ్రద్ద లేకుండా పోతోందని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అంటున్నారు. ఇండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో తమ దేశ ఆటగాళ్లు శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. కనీసం ఆట నిబంధనలను సందర్భానికి తగ్గట్టు అన్వయంచుకోలేకపోతున్నారని అన్నారు. మరోవైపు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరును పొగడ్తలతో ముంచెత్తారు. కోహ్లీ చేసిన అద్భుతంతోనే భారత్ మ్యాచ్ గెలిచందన్నారు. మరోవైపు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సైతం కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి విజయాలు కోహ్లీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రశంసించారు. మొత్తానికి బాబర్ ఆజాం మీద స్వదేశంలో ఒత్తిడి పెరిగిపోయింది.
కాగా.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ – భారత్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. ఆపై క్రీజులోకి వచ్చిన కోహ్లి, హార్దిక్ లు 78 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి క్షణంలో హార్దిక్ ఔటయ్యాడు, కానీ కోహ్లీ చివరి వరకు నిలిచి టీమిండియాను గెలిపించాడు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు కావాల్సిన సమయంలో కోహ్లీ అద్భుతం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..