AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammad Rizwan: ఇదేం ఇంగ్లీష్ రా బాబు..నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్..

ప్రస్తుతం పాకిస్థాన్ కెప్టెన్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాక్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

Mohammad Rizwan: ఇదేం ఇంగ్లీష్ రా బాబు..నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్..
Pakistan Captain Muhammad Rizwan English Interview Goes Viral In Internet
Velpula Bharath Rao
|

Updated on: Nov 18, 2024 | 3:52 PM

Share

క్రికెటర్ల ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఓ పాకిస్తానీ క్రికెటర్‌ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా కచ్చితంగా నవ్వు వస్తుంది. ఈ క్రికెటర్ పాకిస్థాన్ కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్.. తన ఇంటర్వ్యూలో అతని ఇంగ్లీష్ విని జర్నలిస్టు కూడా కంగారు పడ్డాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాక్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. కానీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఓటమి కారణంగా మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ కూడా ప్రశ్నార్థకమైంది.

ఈ మ్యాచ్ తర్వాత ఫీల్డ్‌లో ఉన్న ఒక జర్నలిస్టు మొహమ్మద్ రిజ్వాన్‌కి ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నకు అతను ఇంగ్లీష్‌లో సమాధానం ఇచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే రిజ్వాన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐసిసి పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నిరాకరించడంపై రిజ్వాన్‌ను ఇంటర్వ్యూలో రిపోర్టర్ తన అభిప్రాయాన్ని అడిగాడు. అతనికి రిప్లై ఇవ్వడమే కాకుండా మరేదో గొణుగుతున్నట్లు వీడియోలో కనిపించింది. అతను ఏమి సమాధానం చెప్పాడో, అతను నిజంగా ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాలేదు.

భారతీయ వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా ఈ వీడియోను పోస్ట్ చేశారు. పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చెప్పేది మీకు అర్థమైతే నాకు తెలియజేయండి అంటూ వీడియోపై ఫన్నీ కామెంట్ రాశాడు. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ పోస్ట్‌ను 4 లక్షల 62 వేల 900 మంది వీక్షించగా దాదాపు 3 వేల మంది ‘లైక్‌లు’ పొందారు. 8 జట్ల టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్‌కు పంపకూడదని BCCI నిర్ణయం తర్వాత PCB నిస్సహాయంగా కనిపిస్తోంది. పీసీబీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని ఆశ్రయించినా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. BCCI అభ్యంతరం తర్వాత, ICC ఛాంపియన్స్ ట్రోఫీని PCB ‘ట్రోఫీ టూర్’ని మార్చింది. పాకిస్థాన్ కూడా భారత్ క్లెయిమ్ చేస్తున్న ప్రాంతంలో అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ట్రోఫీని జరపాలని భావించింది. తక్షణమే చర్య తీసుకున్న ఐసీసీ ట్రోఫీని వివాదాస్పద వేదికపైకి తీసుకెళ్లకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై నిషేధం విధించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి