AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లి, ధోనీలను వెనక్కునెట్టి.. ఆసియాలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సృష్టించిన ప్లేయర్.. ఎవరంటే?

Pakistan vs New Zealand: కరాచీ వన్డేలో న్యూజిలాండ్‌పై బాబర్ ఆజం హాఫ్ సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగా ఓ ప్రత్యేక విజయం సాధించాడు.

కోహ్లి, ధోనీలను వెనక్కునెట్టి.. ఆసియాలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సృష్టించిన ప్లేయర్.. ఎవరంటే?
Venkata Chari
|

Updated on: Jan 10, 2023 | 11:38 AM

Share

Pakistan vs New Zealand, Babar azam: పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 9న జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ వ్యక్తిగత ఘనత సాధించాడు. ఈ సమయంలో అతను టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీని వెనక్కునెట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్ ఇన్నింగ్స్ 66 పరుగులు చేశాడు. తొలి వన్డేలో విజయం సాధించిన ఆతిథ్య జట్టు వన్డే సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

విరాట్-ధోని వెనుకంజలో..

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో బాబర్ అజామ్ ఎప్పటిలాగే మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సమయంలో అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 82 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అతని అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. రికార్డులను పరిశీలిస్తే, కనీసం 20 వన్డే ఇన్నింగ్స్‌లలో బాబర్ అజామ్ బ్యాటింగ్ సగటు ఆసియా బ్యాట్స్‌మెన్‌లలో అత్యధికంగా నిలిచింది. ఈ సందర్భంలో విరాట్ కోహ్లీ వంటి వెటరన్ ఆటగాడిని వెనక్కునెట్టాడు. కనీసం 20 వన్డే ఇన్నింగ్స్‌లలో బాబర్ అజామ్ సగటు 59.87గా నిలిచింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు 57.47గా ఉంది. ఇమామ్ ఉల్ హక్ 51.81, మహేంద్ర సింగ్ ధోనీ సగటు 50.57గా నిలిచింది. ఈ విధంగా, కనీసం 20 వన్డేల్లో అత్యధిక సగటు కలిగిన ఆసియాలో మొదటి బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు.

అద్భుతమైన ఫామ్‌లో బాబర్..

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో అతను 161 పరుగుల ఇన్నింగ్స్‌ను సాధించాడు. రెండు టెస్టుల సిరీస్‌లో 226 పరుగులు చేశాడు. మరోవైపు వన్డేల్లోనూ బాబర్ అద్భుతంగా ఆరంభించాడు. ఈ ఏడాది తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించి విజయం సాధించాడు. గతేడాది బాబర్ 9 వన్డేల్లో 679 పరుగులు చేశాడు. గతేడాది వన్డేల్లో పాకిస్థాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బాబర్ గత నాలుగు వన్డేల్లో వరుసగా 4 హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..