PAK vs BAN: ఖాళీ స్టేడియంలో పాక్, బంగ్లా మ్యాచ్.. కీలక నిర్ణయంతో షాకిచ్చిన పీసీబీ.. కారణం ఏంటంటే?

Pakistan vs Bangladesh: ఆగస్టు 21 నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా నిర్మిస్తున్న స్టేడియంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్‌ను నిర్వహించనుంది.

PAK vs BAN: ఖాళీ స్టేడియంలో పాక్, బంగ్లా మ్యాచ్.. కీలక నిర్ణయంతో షాకిచ్చిన పీసీబీ.. కారణం ఏంటంటే?
Pakistan
Follow us
Venkata Chari

|

Updated on: Aug 14, 2024 | 7:29 PM

Pakistan vs Bangladesh: ఆగస్టు 21 నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా నిర్మిస్తున్న స్టేడియంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్‌ను నిర్వహించనుంది. అందుకే అభిమానులను దీనికి దూరంగా ఉంచారు. తొలి టెస్టు రావల్పిండిలో జరగనుండగా, రెండో మ్యాచ్ కరాచీలో జరగనుంది.

కోవిడ్-19 రోజులను గుర్తు చేస్తూ, బంగ్లాదేశ్‌తో రెండో టెస్టును నేషనల్ స్టేడియంలోని ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నందున ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ తెలిపింది.

బోర్డు ఒక ప్రకటనలో, ‘మా ఉత్సాహభరితమైన ప్రేక్షకులు క్రికెట్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని మేం అర్థం చేసుకున్నాం. మా ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చి ప్రోత్సహించేవారు. అయితే, మా అభిమానుల ఆరోగ్యం, భద్రత మా మొదటి ప్రాధాన్యత. “అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, రెండవ టెస్ట్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించడమే సురక్షితమైన విధానం అని మేం నిర్ణయించుకున్నాం” అంటూ షాక్ ఇచ్చింది

ఈ నిర్ణయంతో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరగనున్న రెండో టెస్టు టిక్కెట్ల విక్రయాన్ని తక్షణమే నిలిపివేసినట్లు బోర్డు తెలిపింది. “ఇప్పటికే టిక్కెట్‌లను కొనుగోలు చేసిన అభిమానులు ఆటోమేటిక్‌గా పూర్తి వాపసు అందివ్వనున్నట్లు తెలిపింది. ఇది టిక్కెట్ కొనుగోలు సమయంలో అందించిన ఖాతా వివరాలకు క్రెడిట్ చేయబడుతుంది” అంటూ బోర్డు పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..