డెబ్యూ టెస్టులో దుమ్ముదులిపిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. జట్టుకు హీరోగా మారాడు.. అతడెవరో తెలుసా?

సరిగ్గా మూడేళ్ల క్రిందట ఈరోజున రాజ్‌కోట్ వేదికగా ఇండియా వెర్సస్ వెస్టిండిస్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్..

డెబ్యూ టెస్టులో దుమ్ముదులిపిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. జట్టుకు హీరోగా మారాడు.. అతడెవరో తెలుసా?
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 06, 2021 | 9:58 AM

సరిగ్గా మూడేళ్ల క్రిందట ఈరోజున రాజ్‌కోట్ వేదికగా ఇండియా వెర్సస్ వెస్టిండిస్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. జాతీయ జట్టులో చేరిక ముందు.. దేశవాళీ క్రికెట్‌లో దుమ్ముదులిపాడు. ఎన్నో రికార్డులు తిరగరాశాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ అలా ఉండదు. ముళ్ల మీద ప్రయాణం అని చెప్పాలి. అయితే ఈ బ్యాట్స్‌మెన్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను తలక్రిందులు చేయలేదు. అద్భుతమైన సెంచరీ చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక టీమిండియా తరపున అతి పిన్న వయస్కుడిగా మొదటి టెస్టులో సెంచరీ సాధించిన ఈ బ్యాట్స్‌మన్ మరెవరో కాదు పృథ్వీ షా.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి రోజు పృథ్వీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 99 బంతుల్లో శతకొట్టిన పృథ్వీ షా.. టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ సాధించిన 15వ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించడంతో పాటు అతి పిన్న వయస్కుడిగా ఈ ఫీట్ అందుకున్న ఘనతను కూడా తన పేరును చరిత్రపుటల్లో లిఖించాడు. షా(18 సంవత్సరాల 329 రోజుల) సెంచరీ సాధించగా.. సచిన్ టెండూల్కర్ (17 సంవత్సరాలు, 107 రోజులు) ఈ లిస్టులో ముందు ఉన్నాడు.

ఈ టెస్టులో పృథ్వీ షా సెంచరీ చేయడంతో పాటు రవీంద్ర జడేజా(100*) ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్, విరాట్ కోహ్లీ 139 పరుగులు, పుజారా 86 పరుగులు వెరిసి టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి దోహదపడింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 649 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. ఇందుకు బదులుగా వెస్టిండీస్ జట్టు 181 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక ఫాలో-ఆన్‌లో విండీస్‌ను 196 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్ యాదవ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. అతడు 57 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్ నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు.

Also Read:

మొసలిని నమిలి తినేసిన మరో మొసలి.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!