ప్రపంచ కప్ 2023లో ఓపెనింగ్ జోడీ ఇదే.. లిస్టు నుంచి ఇద్దరు ఔట్.. గట్టి పోటీ ఇస్తోన్న యంగ్ ప్లేయర్.. యూవీ కీలక వ్యాఖ్యలు..

వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ఓపెనింగ్ జోడీకి ఓ యంగ్ ప్లేయర్ బలమైన పోటీదారుగా యూవీ అభివర్ణించాడు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో ఆయన ఓపెనింగ్ చేస్తే..

ప్రపంచ కప్ 2023లో ఓపెనింగ్ జోడీ ఇదే.. లిస్టు నుంచి ఇద్దరు ఔట్.. గట్టి పోటీ ఇస్తోన్న యంగ్ ప్లేయర్.. యూవీ కీలక వ్యాఖ్యలు..
Team India
Follow us

|

Updated on: Dec 07, 2022 | 7:35 AM

28 ఏళ్ల తర్వాత భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ఓపెనింగ్ జోడీకి శుభ్‌మన్ గిల్ బలమైన పోటీదారుగా యూవీ అభివర్ణించాడు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో గిల్ ఓపెనింగ్ చేస్తే శిఖర్ ధావన్ పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

2023లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు శుభ్‌మాన్ గిల్ బలమైన పోటీదారు అని 40 ఏళ్ల మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌లో గిల్ భారత జట్టులో భాగం కాకుండా న్యూజిలాండ్‌లో పర్యటించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

శుభ్‌మన్ ప్రదర్శనపై యువరాజ్ పీటీఐతో మాట్లాడుతూ, ‘శుభ్‌మన్ చాలా బాగా రాణిస్తున్నాడు. అతని ప్రదర్శనలో స్థిరత్వం ఉంది. 2023 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇన్నింగ్స్‌ను తెరవడానికి అతను బలమైన పోటీదారు అని నేను భావిస్తున్నాను. మరో 10 ఏళ్లలో అతను లెజెండ్ అవుతాడని నేను నమ్ముతున్నాను. యూవీ 2019లో అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు. పంజాబ్ యువ క్రికెటర్లకు మెంటార్ పాత్రను పోషిస్తున్నాడు” అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కోవిడ్ -19 కారణంగా 2020లో లాక్‌డౌన్ సమయంలో యూవీతో కలిసి గడిపిన గిల్ యూవీతో శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుత పంజాబ్ కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మతో పాటు ఈ మాజీ భారత జట్టు ఆల్ రౌండర్ నుంచి క్రికెట్ ట్రిక్స్ నేర్చుకున్నాడు.

సెలెక్టర్ల తొలగింపుపై ‘నో కామెంట్’..

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన, సెలెక్టర్ల తొలగింపు ప్రశ్నపై సిక్సర్ కింగ్ మౌనంగా ఉన్నారు. ఈ విషయాలపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

“భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ, నేను దేశంలో ఆట అభివృద్ధికి తోడ్పడగలిగితే, నాకు అభ్యంతరం లేదు” అని యువరాజ్ సూచించాడు. ఇది క్రికెట్ మాత్రమే కాదు. దేశంలో క్రీడల అభివృద్ధికి తోడ్పడాలని నేను ఇష్టపడతానంటూ పేర్కొన్నాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంపై కూడా యూవీ తన అభిప్రాయాన్ని అందించాడు. రోహిత్ కెప్టెన్సీకి పదికి పది మార్కులు ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..