AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng: రోహిత్ తో విభేదాలపై స్పందించిన గంభీర్.. అది చూసి మాట్లాడాలంటూ వార్నింగ్.!

2025లో భారత క్రికెట్ జట్టు విజయాలు, పరాజయాలతో నిండిన సంవత్సరంగా నిలిచింది. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ కోల్పోయిన తర్వాత, ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గంభీర్-రోహిత్ జోడీ గెలిపించారు. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లు పుట్టుకొచ్చాయి, ముఖ్యంగా అభిషేక్ నాయర్ తొలగింపు నేపథ్యంలో. అయితే, గంభీర్ స్వయంగా స్పందిస్తూ, రోహిత్‌ను గౌరవంగా భావిస్తానని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పాడు.

Ind vs Eng: రోహిత్ తో విభేదాలపై స్పందించిన గంభీర్.. అది చూసి మాట్లాడాలంటూ వార్నింగ్.!
Rohit Sharma
Narsimha
|

Updated on: May 07, 2025 | 6:23 AM

Share

2025 సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు కలపలేని మలుపులతో నిండి ఉంది. పదేళ్ల తర్వాత బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ కోల్పోవడం, కానీ రెండు నెలలకే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. భారత కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ఇటీవలి టోర్నమెంట్‌ గెలిచినప్పటికీ, వారిద్దరి మధ్య విభేదాలు ఉండొచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అసలెం జరిగిందీ?

12 ఏళ్ల తర్వాత భారత జట్టు హోమ్ టెస్టు సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌ సమయంలో రోహిత్ స్వయంగా తనను డ్రాప్ చేసుకున్నట్లు చెబితే, కొందరు గంభీర్ తీసేశారని ప్రచారం చేశారు. ఐపీఎల్ 2025లో భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌ను బీసీసీఐ తొలగించింది. రోహిత్‌కు నాయర్ ఎంతో సన్నిహితుడు. నాయర్ తొలగింపుతో గంభీర్-రోహిత్ మధ్య విభేదాలే కారణమన్న ఊహాగానాలు వెలువడ్డాయి.

టెస్టు కెప్టెన్సీ భవితవ్యం?

భారత జట్టు త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ నేపథ్యంలో, కెప్టెన్ – కోచ్ మధ్య బలమైన అవగాహన అవసరం. గంభీర్ సూచనల ఆధారంగా బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రోహిత్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆయన్ను కెప్టెన్‌గా తీసుకెళ్లాలా లేక కేవలం ఆటగాడిగా పరిగణించాలా అన్నది గంభీర్ నిర్ణయం మీద ఆధారపడి ఉండొచ్చు.

గంభీర్ క్లారిటీ :

ఈ నేపథ్యంలో గంభీర్ స్వయంగా వివరణ ఇచ్చాడు. రోహిత్‌తో తానెంతో సన్నిహితంగా ఉన్నానని, అతనిపై గౌరవం పెరిగిందే తప్ప తగ్గలేదని స్పష్టం చేశాడు. “ఇవి యూట్యూబ్‌లో TRP కోసం నడిపే వాళ్లు చేసే కథలు మాత్రమే. రెండు నెలల క్రితమే మేమిద్దరం కలసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అది జరగకపోతే ఇంకెన్ని ప్రశ్నలు వేస్తారో ఊహించండి,” అంటూ గంభీర్ ఓ సమిట్‌లో చెప్పారు. “రోహిత్‌పై నాకు ఎంతో గౌరవం ఉంది. అతను భారత్‌కి చేసిన సేవలు అసాధారణం. అతను జట్టులోకి వచ్చిన రోజు నుంచే నాకు అతనిపై ఎంతో అభిమానం ఉంది. ఇది మారదు,” అంటూ గంభీర్ తేల్చి చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.