Virat Kohli: కోహ్లి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు? శిక్షణ శిబిరంలో వీడిన చిక్కుముడి.. వీడియో
Asia cup 2023: చాలా మంది నిపుణులు విరాట్ కోహ్లీ నంబర్-4లో బ్యాటింగ్ చేయాలని సూచించారు. అయితే క్యాంప్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేసిన తీరుతో టీమ్ ఇండియా ఎలాంటి మార్పులు చేయనుందో తెలిసిపోయింది. దీంతో కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌తోపాటు, టీమిండియా ఓపెనింగ్ ఆర్డర్‌పై క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం బెంగళూరులోని ఆలూరులో భారత క్రికెట్ జట్టు (టీమిండియా) శిక్షణ శిబిరం కొనసాగుతోంది. ఆసియా కప్ (Asia cup 2023) జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో అందరి చూపు గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వస్తున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లపైనే ఉండగా, వీరిద్దరి ప్రదర్శనపై కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ ఓ కన్ను వేస్తున్నారు. ఈ శిబిరం ప్రారంభానికి ముందు క్రీడాకారులందరికీ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. వాటిలో కొన్ని ఫలితాలు కూడా వెలువడ్డాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన రాహుల్, అయ్యర్ ఫిట్‌నెస్ కోసం టెస్ట్ చేయలేదు. అలాగే టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందన్న సూచనలు కూడా ఈ శిబిరం నుంచి అందుతున్నాయి.
క్యాంప్‌నకు ముందు ఆటగాళ్లందరూ తమ ఫిట్‌నెస్‌ని చెక్ చేసుకోవడానికి యో-యో టెస్ట్ చేయించుకున్నారు. కానీ, రాహుల్, అయ్యర్‌లకు ఈ పరీక్ష జరగలేదు. రాహుల్, అయ్యర్‌లకు తర్వాత యో-యో టెస్ట్ నిర్వహిస్తారని క్రిక్‌బజ్ నివేదించింది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసీద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లతో సహా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన చాలా మంది ఆటగాళ్లు ఈ శిబిరంలో లేరు. మరో రెండు రోజుల్లో అందరూ శిబిరానికి వస్తారని, అనంతరం వారందరికీ యో-యో పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.
టాప్ ఆర్డర్‌లో మార్పులు..
Asia Cup 2023 | Experts Go Live During Team India’s Training Camp https://t.co/Ec7DYyL96W
— Star Sports (@StarSportsIndia) August 25, 2023
శుక్రవారం నిర్వహించిన శిబిరంలో అందరూ కఠోర సాధన చేశారు. దీనితో పాటు, జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో కొన్ని సూచనలు కూడా వచ్చాయి. భారత బ్యాట్స్‌మెన్‌లు జంటగా ప్రాక్టీస్ చేశారు. తొలుత రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జోడీ కొత్త బంతితో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇద్దరూ ఫాస్ట్ బౌలర్లు, తర్వాత స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి 3వ స్థానంలోనూ, అయ్యర్ 4వ స్థానంలోనూ బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ మహ్మద్ షమీ, యష్ దయాల్ నుంచి డెలివరీలను ఎదుర్కొన్నారు.
మార్పులు ఎలా ఉండనున్నాయంటే..
Asia Cup 2023 | Watch Team India’s Training Camp LIVE https://t.co/dd52kcrVce
— Star Sports (@StarSportsIndia) August 25, 2023
దీంతో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్దగా మార్పు రాకపోవచ్చని శిబిరంలో ఖాయమైంది. అంతకుముందు, చాలా మంది నిపుణులు విరాట్ కోహ్లీ నంబర్-4లో బ్యాటింగ్ చేయాలని సూచించారు. అయితే క్యాంప్‌లో కోహ్లీ తన సాధారణ క్రమంలో ప్రాక్టీస్ చేయడంతో టీమ్ ఇండియా ఎలాంటి మార్పులు చేసే మూడ్‌లో లేనట్లు తెలుస్తోంది. అదే సమయంలో, భారత ఓపెనింగ్ జోడీపై ఉన్న ఊహాగానాలకు కూడా తెరపడింది.
రాహుల్ ఫిట్‌గా ఉంటాడని, సెప్టెంబర్ 2 లేదా 3 నాటికి జట్టులో చేరతాడని ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడడం కష్టమని రాహుల్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ జట్టులోకి ఎంపిక కావడం ఖాయం. అయితే ఏ క్రమంలో ఆడతారనేది ఇంకా ఖచ్చితంగా తెలియలేదు.
రాహుల్ కఠోర సాధన..
ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌తో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇతడితో పాటు సూర్యకుమార్ యాదవ్‌తో రాహుల్ జోడీగా ప్రాక్టీస్ చేశాడు. దాదాపు గంటసేపు రాహుల్ బ్యాటింగ్ చేశాడు. తొలుత పేసర్లను ఎదుర్కొన్న రాహుల్, ఆ తర్వాత స్పిన్నర్లపై స్వీప్, రివర్స్ స్వీప్ ఆడాడు. కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రాహుల్ బ్యాటింగ్‌ను నిశితంగా పరిశీలించారు. ప్రాక్టీస్ తర్వాత, రాహుల్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో మాట్లాడుతూ కనిపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..