IND vs NZ, 3rd T20: న్యూజిలాండ్ టార్గెట్ 185.. ఆకట్టుకున్న భారత బ్యాట్స్‌మెన్స్.. హాఫ్ సెంచరీతో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్
టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 185 భారీ లక్ష్యాన్ని ఉంచింది.
IND vs NZ, 3rd T20: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 185 భారీ లక్ష్యాన్ని ఉంచింది. కీలక మ్యాచులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(56 పరుగులు, 31 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు), ఇషాన్ కిషన్(29 పరుగులు, 21 బంతులు, 6 ఫోర్లు)లు తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వికెట్లు వెంటవెంటనే పడడంతో మిడిలార్డర్‌లో భారత్ చాలా ఇబ్బంది పడింది. సూర్యకుమార్ యాదవ్ 0, రిషబ్ పంత్ 4 వికెట్లు త్వరగా పడ్డాయి. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(25 పరుగులు, 20 బంతులు, 2 ఫోర్లు), వెంకటేష్ అయ్యర్(20 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) మరో కీలక భాగస్వామ్యాన్ని అందించారు.
వీరిద్దరు పెవిలియన్ చేరిన తరువాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 1, హర్షల్ పటేల్ 18 మూడో కీలక భాగస్వామ్యాన్ని(22 పురుగులు) టీమిండియాకు అందించారు. టీమిండియా హర్షల్ పటేల్ (18) రూపంలో ఏడో వికెట్‌ను కోల్పోయింది. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 18.3 ఓవర్‌లో 162 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.
అయితే చివర్లో దీపక్ చాహర్(21 పరుగులు, 8 బంతులు, 2 ఫోర్లు, 1సిక్స్) కివీస్ బౌలర్లపై ప్రతాపంచూపించి బౌండరీలతో పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. చివరి ఓవర్లో మొత్తం 19 పరుగులు రాబట్టాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి తలో వికెట్ పడగొట్టారు.
Innings Breaks!
After electing to bat first, #TeamIndia post a total of 184/7 for New Zealand to chase.
Scorecard – https://t.co/MTGHRx2llF #INDvNZ @Paytm pic.twitter.com/wUGIfaNX2n
— BCCI (@BCCI) November 21, 2021
Also Read: IND vs NZ: హిట్‌మ్యాన్ @ 150 సిక్సర్లు.. ఆసియాలోనే నంబర్ వన్ ప్లేయర్‌గా రికార్డు..!