IND vs NZ Highlights, 3rd T20: 73 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన

|

Updated on: Nov 21, 2021 | 10:38 PM

IND vs NZ Highlights in Telugu: టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 185 భారీ లక్ష్యాన్ని ఉంచింది.

IND vs NZ Highlights, 3rd T20: 73 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన
India Vs New Zealand, 3rd T20i

India vs New Zealand, 3rd T20I: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 185 భారీ లక్ష్యాన్ని ఉంచింది. కీలక మ్యాచులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(56 పరుగులు, 31 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు), ఇషాన్ కిషన్‌(29 పరుగులు, 21 బంతులు, 6 ఫోర్లు)లు తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. సిరీస్‌లో చివరి టీ20లో భారత్ అత్యద్భుతంగా బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ అండ్ కో తమ ప్రత్యర్థులను వైట్‌వాష్ చేసే లక్ష్యంతో మూడవ T20Iలోకి ప్రవేశించనున్నారు.

భారత్‌కు ఓపెనర్లు సిరీస్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలిచారు. మొదటి T20Iలో, రోహిత్-రాహుల్ ద్వయం 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండవ T20Iలో అంతకుమించి ఆడారు. 154 పరుగుల లక్ష్యాన్ని తేలికగా చేయడంలో భారత్‌కు సహాయపడటానికి సెంచరీ బాగస్వామ్యాన్ని అందించారు.

కివీస్ ఓపెనర్ల అద్భుతమైన ప్రదర్శన ఈ సిరీస్‌ను భారత్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణం. హర్షల్ పటేల్ భారత్ తరపున డెబ్యూ మ్యాచులోనే అదరగొట్టాడు. బంతితో 2 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనలతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 21 Nov 2021 10:38 PM (IST)

    IND vs NZ LIVE: టీమిండియా ఘన విజయం

    టీమిండియా ఇచ్చిన 184 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఏ దశలోనూ చేరుకోలేక పోయింది. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతూ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించి అద్భుత విజయం సొంతం చేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన, ధోని, కోహ్లీలకు సాధ్యం కాని రికార్డును సాధించాడు.న్యూజిలాండ్ టీం కేవలం 17.2 ఓవర్లకు 111పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో రోహిత్ సేన 73 పరుగులతో ఘన విజయం సొంతం చేసుకుంది.

  • 21 Nov 2021 10:28 PM (IST)

    17 ఓవర్లకు కివీస్ స్కోర్..

    న్యూజిలాండ్ టీం 17 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు సాధించింది. క్రీజులో బౌల్ట్ 1, ఫెర్గూసన్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కివీస్ విజయం సాధించాలంటే 18 బంతుల్లో 75 పరుగులు సాధించాలి.

  • 21 Nov 2021 10:12 PM (IST)

    ఏడో వికెట్ డౌన్..

    న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మిచెల్ సాంట్నర్ (2) ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 13.1 ఓవర్‌లో 84 పరుగుల వద్ద కివీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కివీస్ విజయం సాధించాలంటే 40 బంతుల్లో 101 పరుగులు కావాలి.

  • 21 Nov 2021 10:07 PM (IST)

    ఆరో వికెట్ డౌన్..

    న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టిమ్ నీషమ్ (3) ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ అద్బుత క్యాచ్‌కు పెవిలయన్ చేరాడు. దీంతో 12.3 ఓవర్‌లో 76 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. కివీస్ విజయం సాధించాలంటే 44 బంతుల్లో 108 పరుగులు కావాలి.

  • 21 Nov 2021 10:05 PM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ (17) ఐదో వికెట్‌గా పెవిలియ్ చేరాడు.

  • 21 Nov 2021 09:55 PM (IST)

    గప్టిల్ ఔట్..

    న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్ (51 పరుగులు, 36 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్సులు) అర్థ సెంచరీతో ప్రమాదకరంగా మారాడు. దీంతో చాహల్ అద్భుత డెలివరీకి భారీ షాట్ ఆడబోయి సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 10.3 ఓవర్‌లో 69 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 21 Nov 2021 09:50 PM (IST)

    10 ఓవర్లకు కివీస్ స్కోర్..

    న్యూజిలాండ్ టీం 10 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు సాధించింది. క్రీజులో గప్టిల్ 51, టిమ్ సీఫెర్ట్ 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Nov 2021 09:39 PM (IST)

    8 ఓవర్లకు కివీస్ స్కోర్..

    న్యూజిలాండ్ టీం 8 ఓవర్లు ముగిసే సరికి 45 పరుగులు సాధించింది. క్రీజులో గప్టిల్ 36, టిమ్ సీఫెర్ట్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Nov 2021 09:31 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కివీస్..

    న్యూజిలాండ్ పిలిప్స్ (0) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 4.4 ఓవర్‌లో 30 పరుగుల వద్ద కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్‌ తన రెండు ఓవర్‌లోనే 3 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బ తీశాడు.

  • 21 Nov 2021 09:24 PM (IST)

    4 ఓవర్లకు కివీస్ స్కోర్..

    న్యూజిలాండ్ టీం 4 ఓవర్లు ముగిసే సరికి 29 పరుగులు సాధించింది. క్రీజులో గప్టిల్ 24, పిలిప్స్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Nov 2021 09:19 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కివీస్..

    న్యూజిలాండ్ చాప్‌మన్ (0) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ అద్భుత క్యాచ్‌కు బలయ్యాడు. దీంతో 2.6 ఓవర్‌లో 22 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్‌ తన తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బ తీశాడు.

  • 21 Nov 2021 09:16 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కివీస్..

    న్యూజిలాండ్ డారిల్ మిచెల్ (5) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 2.1 ఓవర్‌లో 21 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.

  • 21 Nov 2021 09:10 PM (IST)

    టీ20ల్లో హిట్‌ వికెట్‌‌గా వెనుదిరిగిన భారత బ్యాట్స్‌మెన్స్

    కేఎల్ రాహుల్ vs SL కొలొంబో 2018 హర్షల్ పటేల్ vs NZ కోల్‌కతా 2021

  • 21 Nov 2021 09:08 PM (IST)

    T20Is లో న్యూజిలాండ్ చేధించిన భారీ స్కోర్లు..

    201 vs ZIM హామిల్టన్ 2012 176 vs WI ఆక్లాండ్ 2020 175 vs SL పల్లెకెలె 2019లో

  • 21 Nov 2021 08:50 PM (IST)

    న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్..

    టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 185 భారీ లక్ష్యాన్ని ఉంచింది.

  • 21 Nov 2021 08:42 PM (IST)

    ఏడో వికెట్ డౌన్..

    టీమిండియా హర్షల్ పటేల్ (18) రూపంలో ఏడో వికెట్‌ను కోల్పోయింది. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 18.3 ఓవర్‌లో 162 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.

  • 21 Nov 2021 08:31 PM (IST)

    17 ఓవర్లకు భారత్ స్కోర్..

    17 ఓవర్లకు టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. క్రీజులో హర్షల్ పటేల్ 6, అక్షర్ పటేల్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Nov 2021 08:28 PM (IST)

    ఆరో వికెట్ డౌన్..

    టీమిండియా శ్రేయాస్ అయ్యర్ (25) రూపంలో ఆరో వికెట్‌ను కోల్పోయింది. మిల్నే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయాస్ పెవిలియన్ చేరాడు. దీంతో 16.1 ఓవర్‌లో 140 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది.

  • 21 Nov 2021 08:25 PM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    టీమిండియా వెంకటేష్ అయ్యర్ (20) రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి వెంకటేష్ పెవిలియన్ చేరాడు. దీంతో 15.5 ఓవర్‌లో 139 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.

  • 21 Nov 2021 08:06 PM (IST)

    T20Iలలో అత్యధిక 50+ స్కోర్లు

    30 రోహిత్ శర్మ (ఇందులో 100+ భాగస్వామ్యాలు 4) 29 విరాట్ కోహ్లీ 25 బాబర్ ఆజం (1 X 100) 22 డేవిడ్ వార్నర్ (1 X 100)

  • 21 Nov 2021 08:04 PM (IST)

    రోహిత్ ఔట్..

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (56) రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఇష్ సోధి బౌలింగ్‌లో రివర్స్ క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. దీంతో 11.2 ఓవర్‌లో 103 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 21 Nov 2021 08:00 PM (IST)

    రోహిత్ @ అర్థ సెంచరీ

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 26 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సులు బాదేశాడు. 166 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 21 Nov 2021 07:55 PM (IST)

    10 ఓవర్లకు భారత్ స్కోర్..

    10 ఓవర్లకు టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 48, శ్రేయాస్ అయ్యర్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలింగ్‌లో సాంట్నర్ 3 వికెట్లతో టీమిండియాను భారీగా దెబ్బతీశాడు.

  • 21 Nov 2021 07:50 PM (IST)

    మూడో వికెట్ డౌన్..

    టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ (4) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో నీషమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 83 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

  • 21 Nov 2021 07:44 PM (IST)

    రెండో వికెట్ డౌన్..

    టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. సెకండ్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్(0) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో గప్టిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 71 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

  • 21 Nov 2021 07:38 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్(29 పరుగులు, 21 బంతులు, 6 ఫోర్లు) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో కీపర్ సీఫెర్ట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

  • 21 Nov 2021 07:34 PM (IST)

    ఆరు ఓవర్లకు భారత్ స్కోర్..

    ఆరు ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 29, ఇషాన్ కిషన్ 39 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఓపెనర్లు ఇద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో 3 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి.

  • 21 Nov 2021 07:17 PM (IST)

    మూడు ఓవర్లకు భారత్ స్కోర్..

    మూడు ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 14, ఇషాన్ కిషన్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Nov 2021 07:04 PM (IST)

    IND vs NZ LIVE: బ్యాటింగ్ ఆరంభించిన భారత్

    టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, కీపర్ ఇషాన్ కిషన్ బరిలోకి దిగారు.

  • 21 Nov 2021 06:40 PM (IST)

    IND vs NZ LIVE: టీమిండియా ప్లేయింగ్ XI

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేష్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్

  • 21 Nov 2021 06:39 PM (IST)

    IND vs NZ LIVE: న్యూజిలాండ్ ప్లేయింగ్ XI

    న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్

  • 21 Nov 2021 06:37 PM (IST)

    IND vs NZ LIVE: టాస్ గెలిచిన టీమిండియా

    కీలకమైన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ మూడోసారి టాస్ గెలిచాడు. అయితే ఈ సారి మాత్రం తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో న్యూజిలాండ్ టీం బౌలింగ్ చేయనుంది.

Published On - Nov 21,2021 6:32 PM

Follow us
Latest Articles
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..