AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ vs ENG 2nd Test: చరిత్ర సృష్టించిన కేన్ మామా.. తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డ్.. 10ఏళ్ల నాటి తప్పటడుగులో ఇంగ్లండ్..

NZ vs ENG 2nd Test Updates: ఇంగ్లండ్‌తో జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బలమైన పునరాగమనం చేసింది. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ కెరీర్‌లో 26వ సెంచరీ నమోదు చేశాడు.

NZ vs ENG 2nd Test: చరిత్ర సృష్టించిన కేన్ మామా.. తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డ్.. 10ఏళ్ల నాటి తప్పటడుగులో ఇంగ్లండ్..
Kane Williamson
Venkata Chari
|

Updated on: Feb 27, 2023 | 3:35 PM

Share

New Zealand vs England 2nd Test Match: న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును కాపాడేందుకు నడుం బిగించాడు. ఫాలోఆన్‌ ఆడిన న్యూజిలాండ్‌ 483 పరుగులకు ఇన్నింగ్స్‌ ముగించింది. ఇప్పుడు ఇంగ్లండ్ విజయానికి 210 పరుగులు చేయాల్సి ఉంది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన టెస్టు కెరీర్‌లో రికార్డు స్థాయిలో 26వ సెంచరీని నమోదు చేసి న్యూజిలాండ్‌కు అండగా నిలిచాడు. 226 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.

వెనుకంజలో రాస్ టేలర్..

ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేన్ విలియమ్సన్ 282 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేశాడు. అదే సమయంలో అతను రాస్ టేలర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. కేన్ విలియమ్సన్ తన 92వ టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు గతంలో రాస్ టేలర్ పేరిట ఉంది. అతను 112 మ్యాచ్‌లలో 44.66 సగటుతో 7683 పరుగులు చేశాడు. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ 7787 పరుగులతో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

శుభాకాంక్షలు తెలిపిన టేలర్..

ఈ ఘనత సాధించిన కేన్ విలియమ్సన్‌ను రాస్ టేలర్ అభినందించాడు. న్యూజిలాండ్ తరపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన కేన్ విలియమ్సన్‌కు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు. టెస్టు క్రికెట్‌‌లో మీరు ఎంత అంకితభావంతో పనిచేశారో చెప్పడానికి మీ ప్రదర్శనే నిదర్శనం. ఇంకా చాలా ఏళ్లు ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు.

ఫాలో ఆన్‌లో గండం నుంచి అద్భుతంగా పునరాగమనం..

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 435 పరుగులకు సమాధానంగా న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ ను కేవలం 209 పరుగులకే ముగించింది. దీంతో ఫాలో-ఆన్ ఆడవలసి వచ్చింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌ను సులభంగా గెలుస్తామని భావించింది. కానీ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (61), టామ్ బ్లండెల్ (90), టామ్ లాథమ్ (83), ఆపై కేన్ విలియమ్సన్ (132) అద్బుత బ్యాటింగ్‌తో పుంజుకుంది.

న్యూజిలాండ్‌ను ఫాలో-ఆన్ ఆడించి బెన్ స్టోక్స్ 10 సంవత్సరాల క్రితం చేసిన తప్పును పునరావృతం చేస్తాడా?

2013లో ఈ మైదానంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ అలెస్టర్ కుక్ న్యూజిలాండ్‌కు ఫాలోఆన్ ఇచ్చాడు. కానీ, ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టోక్స్ మళ్లీ అదే తప్పు చేశాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్, జో రూట్‌ల వికెట్లు కోల్పోతే ఇంగ్లండ్ కష్టాలు పెరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..